Advertisement
Google Ads BL

పుష్ప హిందీ కష్టాలు తీరినట్లే


అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప మూవీ డిసెంబర్ 17 న ఐదు భషాల్లో పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతుంది. రెండు పార్ట్ లుగా తెరకెక్కునున్న పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప ద రైజ్ అంటూ డిసెంబర్ 17 న రిలీజ్ కి సిద్దమవుతుంది. అయితే అల్లు అర్జున్ పుష్ప కి హిందీ రిలీజ్ ప్రోబ్లెంస్ అంటూ చాలారోజుల నుండి న్యూస్ చక్కర్లు కొడుతోంది. తెలుగు, తమిళ, మలయాళం లో పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగినా.. హిందీ లో ఇంకా పుష్ప సినిమా రిలీజ్ కి ఎవరూ ముందుకు రాలేదని అంటున్నారు. మరి ఇప్పటివరకు పుష్ప ప్రమోషన్స్ అన్నీ.. ఐదు భషాల్లో గ్రాండ్ గా జరుగుతున్నాయి, పుష్ప టీజర్, సాంగ్స్ అన్ని హిందీలో రిలీజ్ అయ్యి వైరల్ అవుతున్నాయి.

Advertisement
CJ Advs

అయితే తాజాగా పుష్ప హిందీ కష్టాలు తొలిగాయంటున్నారు. అంటే హిందీలో పుష్ప మూవీ AA Films India సంస్థ హిందీలో విడుదల చేస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాకుండా పుష్ప కన్నడ వెర్షన్ ని స్వాగత్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు గా తెలుస్తుంది. దానితో అల్లు అర్జున్ ఇంకా సుకుమార్ లు పుష్ప పై క్రేజ్ పెంచేందుకు దుబాయ్ నుండి పుష్ప ప్రమోషన్స్ ని మొదలు పెట్టబోతున్నారని, త్వరలోనే పుష్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారని తెలుస్తుంది. రష్మిక మందన్న శ్రీవల్లిగా, అనసూయ దాక్షాయణిగా, సునీల్ ఇంకా విలన్ గా ఫహద్ ఫాజిల్ నటిస్తున్న ఏ సినిమాపై ట్రేడ్ లోను, పాన్ ఇండియా మార్కెట్ లోను భారీ అంచనాలున్నాయి. 

Pushpa team confirmed the Hindi distributors:

Allu Arjun Pushpa - The Rise Hindi Version Confirmed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs