బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది మొదలు.. ఒక్కదాన్నే ఆడుతున్నాను, మీరంతా గ్రూప్ గా ఆడుతున్నారు, ఫ్రెండ్స్ గా ఆడుతున్నారు అంటూ అరుస్తూ గొడవ పడుతూ.. పర్సనల్ గాను కాజల్ తో గొడవ పెట్టుకుంటూ.. హౌస్ లో 11 వారాలు పూర్తి చేసుకుని, కాజల్ ని నాగిని గేమ్ ఆడుతున్నావ్ అంటూ రచ్చ చేసిన అని మాస్టర్ ఈ వారం ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి వెళ్ళిపోతుంది. ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం చాలా గొడవ పడింది. సన్నీ కి వచ్చింది. అయినా అని మాస్టర్ హౌస్ లో చేసిన రచ్చ మాములుగా లేదు.
ఇక ఈ వారం ఓటింగ్ లో తక్కువ ఓట్స్ వచ్చిన అని మాస్టర్ ని బిగ్ బాస్ ప్రేక్షకులు ఇంటికి పంపించేశారు. రవి, శ్రీరామ్ చంద్ర లని వాళ్ళ సపోర్ట్ తో అని మాస్టర్ ఆడినా.. ఎప్పుడు అది ఒప్పుకోలేదు. ఇక వచ్చే వారం జరిగే ఒక స్పెషల్ ఎపిసోడ్ కోసం ఆమెను ఈ వారం తప్పిస్తున్నారని అంటున్నారు. ఇక ఈరోజు శనివారం ఎపిసోడ్ లో షన్ను, మానస్, కాజల్, సన్నీలను నాగార్జున సేవ్ చేసి మిగతా నలుగురిని సస్పెన్స్ లో పెట్టి, కాజల్ ని ఇమిటేట్ చేసే అని మాస్టర్ ని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ స్టేజ్ పైకి తీసుకురాగా.. నాగార్జున ఆమెతో హౌస్ మేట్స్ తో మాట్లాడించి ఇంటికి పంపేసినట్లుగా లీకులు చెబుతున్నాయి.