Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ భలే బ్యాలెన్స్ చేసాడే...


యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెకేషన్ కోసం టూర్ వెళ్లి నేడు హైదరాబాద్ కి తిరిగివచ్చారు. ఇక టూర్ నుండి వచ్చిన ఎన్టీఆర్ నిన్న ఏపీ అసెంబ్లీలో నారా భువనేశ్వరి పై జరిగిన అవమానం పై ఓ వీడియో ద్వారా స్పందించారు. అయితే ఎన్టీఆర్ ఆ వీడియో లో చాలా బాలెన్సుడ్ గా వ్యవహారాన్ని చక్కబెట్టారు. ఎందుకంటే ఎన్టీఆర్ అక్కడ నందమూరి ఫ్యామిలీ మెంబెర్ గానో, లేదంటే ఒక టీడీపీ కార్యకర్తగానో మాట్లాడలేదు.. ఓ తల్లికి కొడుకుగా, ఓ భార్యకి భర్తగా, ఓ తండ్రిగా, దేశ పౌరుడిగా మాత్రమే మాట్లాడుతున్నా అని చెప్పాడు. సంస్కృతీ, సంప్రదాయాలు, ఆడవాళ్లపై వ్యక్తిగత దూషణలు, రాజకీయనాయకులు.. మాట్లాడే విధాన్ని మార్చుకోమంటూ చెప్పాడే కానీ.. ఎక్కడా వైసీపీ మంత్రులపై ఫైర్ అవ్వలేదు. ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ ప్రెస్ మీట్ లో బాలకృష్ణ దగ్గర నుండి రామకృష్ణ, ఇక భువనేశ్వరి సోదరులు భువనేశ్వరిని  అన్నమాటలకు వైసిపి వారిని హెచ్చరించారు.

Advertisement
CJ Advs

మరి ఎన్టీఆర్ వైసిపి మంత్రులని పల్లెత్తుమాట అనకుండా.. తన వీడియోలో చాలా బ్యాలెన్స్ చేసుకున్నాడు. కొడాలి నాని, వల్లభనేని వంశీలతో ఎన్టీఆర్ కి సన్నిహిత సంబందాలు ఉన్నాయి.. కాబట్టే ఇటు ఫ్యామిలీ పరంగాను, అటు పార్టీ పరంగాను ఎన్టీఆర్ ఇన్వాల్వ్ అవ్వకుండా.. ఆ వీడియో లో మాట్లాడాడు. ఒక ఆడబిడ్డకు జరిగిన అవమానముపై ఎన్టీఆర్ మాట్లాడాడు కానీ.. ఎక్కడా అత్త అని కానీ, అలాగే నందమూరి కుటుంబ సభ్యుడిగా కానీ ఎన్టీఆర్ మాట్లాడలేదు. ఈ వ్యవహారంతో ఎన్టీఆర్ టిడిపికి దూరంగా ఉన్నాడని మరోసారి స్పష్టమైనది.

ఇక మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్, నాగబాబు ఈ ఇష్యుపై వైసీపీ నాయకులపై ఘాటుగా స్పందించినట్లుగా కూడా యంగ్ టైగర్ స్పందించకపోవడం అటు నందమూరి ఫాన్స్ లోను, ఇటు టీడీపీ కార్యకర్తల్లోనూ ఆందోళన కనిపిస్తుంది. 

Young Tiger NTR balances really well:

NTR Video: Balances Party and family 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs