Advertisement
Google Ads BL

అఖండ సెన్సార్ టాక్


డిసెంబర్ 2 న భారీ స్థాయిలో రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్న అఖండ మూవీ పై ప్రేక్షకుల్లోనే కాదు.. ట్రేడ్ లోనూ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ - బోయపాటి కాంబో అంటే ఏ రేంజ్ అంచనాలు ఉంటాయో చెప్పడం కష్టం. లెజెండ్, సింహ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కాంబో ఇప్పుడు అఖండ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ భారీగా రిలీజ్ కి సిద్దమైన అఖండ సెన్సార్ కార్యకమాలను పూర్తి చేసుకుంది. 2 గంట‌ల 45 నిమిషాల నిడివితో అఖండ మూవీ సెన్సార్ కి వెళ్లగా.. అఖండ ఫ‌స్టాఫ్ అంతా 90 నిమిషాల‌ నిడివి క‌ట్ చేసారని, సెకండాఫ్ మ‌రో 5 నిమిషాలు కలిపి 95 నిమిషాల నిడివితో అఖండ ప్రేక్షకుల ముందు రాబోతుంది అని తెలుస్తుంది.

Advertisement
CJ Advs

 

అఖండ మూవీ కి సెన్సార్ బోర్డు U/A స‌ర్టిఫికెట్ జారీ చేసింది. పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ స్క్రీన్ స్పేస్, అలాగే ఆయన స్టయిల్ అన్ని హైలెట్ అనేలా ఉన్నాయని, అఘోర కేరెక్టర్ మాత్రం ఇంటర్వెల్ తర్వాత ఎంటర్ అవ్వుద్ది అని, సెకండ్ హాఫ్ అంతా అఘోర పాత్రదే కీలకం అని అంటున్నారు. ఇక సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా కీలకం అని, ఇంటర్వెల్ ఫైట్ తో పాటుగా.. క్లైమాక్స్ ఫైట్ అదిరిపోయేలా బోయపాటి తెరకెక్కించారని, విలన్ గా శ్రీకాంత్ మేకోవర్, ఆయన కేరెక్టర్ 100 శాతం ప్రేక్షకులు ఆకట్టుకునేలా ఉంటుంది అంటున్నారు. ఆలాగే థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్లబోతుంది అంటూ.. ఇదే అఖండ సెన్సార్ టాక్ అంటూ సోషల్ మీడియాలో సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. 

Akhanda Censor Talk:

Balakrishna Akhanda gets Censored
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs