ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిని.. వైసిపి మంత్రులు అవమానకర రీతిలో మాట్లాడడంతో.. చంద్రబాబు కన్నీటి పర్యంతమవడమే కాదు.. మీడియా మీట్ లో వెక్కి వెక్కి ఏడవడం హాట్ టాపిక్ గా మారింది.. ఏపీ అసెంబ్లీ లో వైసీపీ మంత్రులు టీడీపీ నేతలని దూషించడమే కాకుండా.. వ్యక్తిగతంగా పార్టీ అధినాయకుడి భార్యని దూషించడంతో టీడీపీ నేతలు వైసిపి పై ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో ఘోర అవమానంగా వారు అభివర్ణిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా నేను ఓడిపోయినప్పుడు కూడా నేను ఇంతగా బాధపడలేదు అన్నారు. ఇక చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడంతో.. పలు ఛానల్స్ లో డిబేట్స్ పెడుతున్నారు.
సినిమా ఇండస్ట్రీ నుండి, పొలిటికల్ గా చంద్రబాబు పై పర్సనల్ గా వైసీపీ చేసిన వ్యాఖ్యలపై పవన్ ఫైర్ అయ్యారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుండి బడా నిర్మాత అశ్విని దత్ చంద్రబాబు కి అండగా నిలుస్తామన్నారు. అశ్విని దత్ మాట్లాడుతూ.. ఏ మాత్రం స్థాయి లేని వెధవలు అన్న మాటలకు బాధపడాల్సిన, ఆవేదన చెందాల్సిన అవసరం లేదు అని, భువనేశ్వరిపై అసభ్య పదజాలం వాడినందుకు, పనికిమాలిన వ్యక్తుల ప్రమాణాలకు అతీతమైన ఎత్తులో చంద్రబాబు ఉన్నారు అని అన్నారు. ఇక కె రాఘవేంద్రరావు కూడా చంద్రబాబు కి అండగా మాట్లాడారు. వ్యక్తులని గౌరవించుకోవాలన్న రాఘవేంద్ర రావు.. భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. భువనేశ్వరి సోదరి, బిజెపి నేత పురందరేశ్వరి.. తన సోదరిపై వైసీపీ వ్యాఖ్యలను ఖండించారు. నేను మా సోదరి నైతిక విలువలతో పెరిగాం.. అంటూ ఆవిడ స్పందించారు. అంతేకాకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హరి నాధ్ చంద్రబాబు భార్యపై వైసీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు.