తెలుగులో, తమిళ్ లో తమన్నా, విజయ్ సేతుపతి హోస్ట్ లుగా మాస్టర్ చెఫ్ అంటూ వంటల ప్రోగ్రాం ని గ్రాండ్ గా మొదలు పెట్టారు నిర్వాహకులు. తెలుగు మాస్టర్ చెఫ్ బెంగుళూర్ లోని ఓ కాష్ట్లీ సెట్ లో జరుగుతుంది. హీరోయిన్ తమన్నా కి భారీ పారితోషకం ఇచ్చి ఈ ప్రోగ్రాం కి హోస్ట్ గా తెచ్చారు. అయితే మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం మొదలైనప్పటినుండి వీక్ టీఆర్పీ తో జెమినిలో శుక్రవారం, శనివారాల్లో ప్రసారం అవుతుంది.. ఇక తమన్నా కి భారీ పారితోషకం ఇవ్వడం వలన ఎలాంటి యూస్ లేదు.. అలాగే ఆమె మాస్టర్ చెఫ్ ఈవెంట్ నిర్వాహకులను కాస్త ఇబ్బందులకు గురి చెయ్యడంతో ఆమెని తప్పించి ఆమె ప్లేస్ లోకి టాలీవుడ్ టాప్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ని తీసుకువచ్చారు.
అనసూయ గత రెండు వారాలుగా తమన్నా ప్లేస్ లో మాస్టర్ చెఫ్ వేదికపై జెడ్జెస్ తో పాటుగా హడావిడి చేస్తుంది. అనసూయ అందం, ఆకర్షణ కోసం అయినా టీఆర్పీ పెరుగుతుంది అనుకుంటే.. తమన్నా ఉన్నప్పుడు షో కి ఎలాంటి టీఆర్పీ ఉందో.. అనసూయ వచ్చినా అందులో ఏ మార్పు లేదు. అనసూయ ఆకర్షణ, అందం ఎందుకు పనికిరాలేదు. అందుకేనేమో మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం నుండి అనసూయని కూడా తప్పించునట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి శుక్రవారం మాస్టర్ చెఫ్ ఈవెంట్ లో సందడి చేసే అనసూయ ఈ వారం కనిపించలేదు.. మాస్టర్ చెఫ్ ఫైనల్ ఎపిసోడ్స్ నడుస్తున్నాయి.. ఆ జెడ్జిస్ యాంకర్ లా మారిపోయి.. హోస్ట్ చేసేస్తున్నారు. మరి అనసూయకి హైదరాబాద్ నుండి ఫ్లైట్స్ టికెట్స్ వేసి, భారీ పారితోషకం ఇచ్చినా ఎలాంటి యూస్ లేదు.. షో కి క్రేజ్ పెరగలేదు అని షో నుండి అనసూయ ని కూడా తప్పించారా.. అనే చర్చ మొదలయ్యింది.