Advertisement
Google Ads BL

బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో కి బ్రేక్


అఖండ మూవీ తోనే అందరిలో అంచనాలు రేపి.. లుక్ వైజ్ గా ఆసకిని క్రియేట్ చేస్తున్న నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఆహా ఓటిటి లో అన్ స్టాపబుల్ టాక్ షో లో లుక్స్ తోనూ, స్టయిల్ గాను అదరగొట్టేస్తున్నారు. అల్లు అరవింద్ ఆహా ఓటిటి కోసం బాలయ్య తో అన్ స్టాపబుల్ టాక్ షో నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ క్రేజ్, ఆయన అల్లరి, కామెడీ, లుక్స్, స్టయిల్ అన్ని ఆ షో కి వన్నె తెచ్చాయి. ఆహా అన్ స్టాపబుల్ ఫస్ట్ ఎపిసోడ్ తోనే ఈ షోపై ఎనలేని అంచనాలు పెంచేయడంతో.. ఆహా ఓటిటికి క్లిక్స్ పెరిగాయి.. ఫలితంగా సబ్ స్క్రైబర్స్ పెరిగారు. మోహన్ బాబు తో ఫస్ట్ ఎపిసోడ్ అన్ స్టాపబుల్ అంటూ విపరీతమైన క్రేజీ ఎపిసోడ్ గా నిలిచింది.

Advertisement
CJ Advs

అలాగే సెకండ్ ఎపిసోడ్ లో నాని తో బాలకృష్ణ చేసిన అల్లరి, నాని తో ఆడుకున్న విధానం, అలాగే ఆడియన్స్ తో బాలయ్య చేసిన రచ్చ అన్ని ఆ ఎపిసోడ్ కె హైలైట్ గా నిలిచాయి. దానితో మూడో ఎపిసోడ్ పై అంచనాలు పెరిగిపోయాయి. మూడో ఎపిసోడ్ కి పాన్ ఇండియా స్టార్ లైగర్ హీరో విజయ్ దేవరకొండ రాబోతున్నాడనగానే ఆ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే ఆ ఎపిసోడ్ ప్రోమో ఈరోజు రావాల్సింది.. కానీ ఆహా ఓటిటి ఆ ప్రోమో వదల్లేదు.. దానితో రెండో ఎపిసోడ్ కే ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో కి బ్రేకులు అంటూ ప్రచారం మొదలైపోయింది. అంటే బాలకృష్ణ చేతికి సర్జరి జరగడం వలనే ఈ షోకి బ్రేకులు పడ్డాయని, కాదు విజయ్ దేవరకొండ అందుబాటులో లేకపోవడంతో ఈ షో ఎపిసోడ్ అవ్వలేదంటూ ఏవేవో ఊహాగానాలు మొదలైపోయాయి.

దానితో ఆహా ఓటిటి వారు స్పందిస్తూ.. అనుకోని అనివార్య పరిస్థితుల కారణంగా ఈ వారం ఎపిసోడ్‌ను విడుదల చేయలేదు. కానీ త్వరలోనే గట్టిగా రాబోతున్నాము.. అప్పటిదాకా ఆయన పేరు మీకు తెలుసు, ఆయన స్థానం మీ మనసు అన్తరూ ట్వీట్ చెయ్యడంతో నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Break for Balayya Unstoppable Talk Show:

Break for Aha OTT Unstoppable Talk Show
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs