Advertisement
Google Ads BL

విక్కీ కౌశల్ తో పెళ్లి: కత్రినా సంచలనం


కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ ప్రేమాయణానికి శుభం కార్డు పడబోతోంది. వచ్చే నెలలో ఈ లవ్ బర్డ్స్ ఇద్దరూ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. కొన్నేళ్లుగా సీక్రెట్ లవ్ ని మెయింటింగ్ చేస్తున్న ఈజంట పెద్దల అంగీకారంతో.. రాజస్థాన్ లో పెళ్లి చేసుకోబోతున్నారు. కత్రినా తో పెళ్లి విషయమై విక్కీ కౌశల్ తన పెద్దవాళ్ళని ఒప్పించి.. ఇష్టసఖిని చేసుకోబోతున్నప్పటికీ.. కత్రినా కైఫ్ కానీ, విక్కీ కానీ ఈ విషయాన్నీ పబ్లిక్ గా చెప్పడం లేదు. డిసెంబర్ లో జరగబోయే విక్కీ కౌశల్ - కత్రినా ల పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలైపోయినట్లుగా బాలీవుడ్ మీడియా టాక్. ఇక కత్రినా, విక్కీ కౌశల్ కి భార్య అయ్యే ముందు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

విక్కీ కౌశల్ తో ఏడడుగులు వెయ్యడానికి ముందే కత్రినా కైఫ్ తన ఇంటి పేరుని విక్కీ ఇంటి పేరు చేసుకోబోతుంది అని, ఇకపై ఆమె నటించే సినిమాల్లో కత్రినా కైఫ్ కి బదులుగా కత్రినా కౌశల్ అని వేయించుకొంటున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే తన దగ్గరకు వస్తున్న దర్శకనిర్మాతలకు తన నిర్ణయం చెబుతుంది అని, అలాగే తాను నటిస్తున్న సల్మాన్ ఖాన్ టైగర్ 3 లో కూడా తన పేరుని కత్రినా కౌశల్ గా మార్చమని మేకర్స్ కి చెప్పినట్టుగా బిటౌన్ లో గుసగుసలు వినిపిసితున్నాయి. అంటే పెళ్ళికి ముందే కత్రినా కైఫ్ నుండి కౌశల్ ఇంటి కోడలిగా ప్రకటించేసుకుంది అన్నమాట. 

Katrina kaif takes a stunning decision:

Katrina Kaif Sensational Decision 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs