Advertisement
Google Ads BL

రెండో సినిమాకే లిప్ లాక్ ఇచ్చేసింది


ఉప్పెన సినిమాతో 17 ఏళ్లకే సెన్సేషన్ క్రియేట్ చేసిన కృతి శెట్టి.. ఆ సినిమా రిలీజ్ కాకుండానే బోలెడన్ని సినిమాలతో బిజీ అయ్యింది. ఉప్పెన సినిమా రిలీజ్ టైం కే నాని తో శ్యామ్ సింగరాయ్ లో నటించేసింది. ఆ తర్వాత RAPO19 అంటూ హీరో రామ్ తో, అలాగే సుధీర్ బాబు - ఇంద్రగంటి సినిమాలోనూ, మాచర్ల నియోజక వర్గం లో నితిన్ తో జోడి కట్టిన కృతి శెట్టి.. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య తో బంగార్రాజు మూవీ లో నటించడం.. అప్పుడే నాగలక్ష్మి గా ఫస్ట్ లుక్ వచ్చెయ్యడం కూడా జరిగిపోయింది. ఉప్పెన లో చాలా ట్రెడిషనల్ గా లంగా వోణి, చీరలో కనిపించిన కృతి శెట్టి.. బంగార్రాజులో అచ్చ తెలుగు పల్లెటూరి ఆపడుచులా కనిపిస్తుంది. ఆ లంగావోణీ.. చూడగానే ముద్దొచ్చేట్టుగా.. ఉంది బంగ్గారాజు లో కృతి లుక్.

Advertisement
CJ Advs

మరి ఉప్పెన సినిమాతో కృతి శెట్టి కెరీర్ ఏ రేంజ్ లో ఉందో.. ఈ సినిమాలే ఉదాహరణ. ఇక ఉప్పెన లో ప్రేమ ప్రేమ అంటూ తిరిగిన కృతి శెట్టి రెండో సినిమాకే యంగ్ హీరో నానికి ముద్దెట్టిసింది. అది కూడా లిప్ లాక్. నానితో శ్యామ్ సింగరాయ్ మూవీలో కృతి శెట్టి మోడరన్ గా కనిపించబోతుంది. శ్యామ్ సింగరాయ్ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఆ టీజర్ లోనే కృతి శెట్టి నాని కి రొమాంటిక్ గా లిప్ లాక్ పెట్టేసింది. మరి రెండో సినిమాకే కృతి శెట్టి ముద్దు పెట్టేంతగా ఎదిగిపోయింది. ఇక సినిమాలే కాదు.. సోషల్ మీడియాలోనూ కృతి శెట్టి స్పెషల్ ఫోటో షూట్స్ తో ఓ ఊపు ఊపేస్తోంది. 

Krithi Shetty Lip Lock With Nani:

Krithi Shetty Lip Lock With Nani in Shyam Singha Roy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs