Advertisement
Google Ads BL

పుష్ప: ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా లిరిక్స్


సోషల్ మీడియాలో పుష్ప ప్రభంజనం మొదలైపోయింది. అల్లు అర్జున్ - సుకుమార్ - పుష్ప మేకర్స్ పుష్ప ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళుతున్నారు. డిసెంబర్ 17 న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప సినిమాపై ట్రేడ్ లో, పాన్ ఇండియా మార్కెట్ లో భారీ అంచనాలున్నాయి. పుష్ప నుండి ఏ అప్ డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ చేస్తున్నారు అల్లు ఫాన్స్. ఇప్పటికే విడుదలైన పుష్ప ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి, సామి సామి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అంటూ సాగే నాలుగో సింగిల్‌ విడుదలైంది. విడుదలైన మరుక్షణం నుంచి ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది. ఈ సినిమాలో విలన్ గా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఈ పక్క నాదే.. ఆ పక్క నాదే.. తలపైన ఆకాశం ముక్క నాదే..

ఆ తప్పు నేనే.. ఈ ఒప్పు నేనే.. తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే..

నన్నయితే కొట్టేటోడు భూమ్మీదే పుట్టలేదు..

పుట్టాడా అది మళ్ళా నేనే..

నను మించి ఎదిగేటోడు ఇంకోడు ఉన్నాడు చూడు.. ఎవడంటే అది రేపటి నేనే..

నే తిప్పానా మీసమట.. సేతిలోన గొడ్డలట.. సెసిందే యుద్దమాట.. సేయందే సంధి అటా...

ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా.. (4)

నిను ఏట్లో ఇసిరేస్తా.. నే సేపతో తిరిగొస్తా..

గడ కర్రకు గుచ్చేస్తా.. నే జెండాలా ఎగరేస్తా..

నిను మట్టిలో పాతేసి మాయం చేస్తా..

ఖరీదైన ఖనిజంలా మళ్లీ నేను దొరికేస్తా..

ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా.. (4)

ఎవడ్రా ఎవడ్రా నువ్వు.. ఇనుమును ఇనుమును నేను..

నను కాల్చితే కత్తి అవుతాను..

ఎవడ్రా ఎవడ్రా నువ్వు.. మట్టిని మట్టిని నేను..

నను తొక్కితే ఇటుకవుతాను..

ఎవడ్రా ఎవడ్రా నువ్వు.. రాయిని రాయిని నేను..

గాయం కానీ చేశారంటే ఖాయంగా దేవుడిని అవుతాను..

ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా.. (4)

Pushpa: Eyy Bidda Idhi Naa Adda song released:

Allu Arjun Pushpa: Eyy Bidda Idhi Naa Adda song released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs