ప్రభాస్ - పూజ హెగ్డే కాంబోలో రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న రాధేశ్యామ్ పై పాన్ ఇండియా మార్కెట్ లో మాంచి క్రేజ్ ఉంది.. ప్రభాస్ ఫాన్స్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పునర్జన్మ ల నేపథ్యంలో తెరకెక్కుతుంది అనే టాక్ సినిమా మొదలైనప్పటినుండి ఉంది. విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజ హెగ్డే కనిపించబోతున్న ఈ సినిమా కథ గురించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. రాధేశ్యామ్ టీజర్స్, ఫస్ట్ సాంగ్ చూసిన తర్వాత ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ కీలకం అని.. అది కూడా ఓ మిస్టరీ రైల్ కథ అంటూ ప్రచారం జరుగుతుంది.
గతంలో ఇటలీలో మిస్ అయిన ఓ మిస్టరీ రైల్ కి.. రాధేశ్యామ్ కథకి లింక్ పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఇటలీలో 106 మంది పాసింజర్లని ఎక్కించుకుని వెళుతున్న రైల్ 1911 సమయంలో మాయమైపోయి గతంలోకి వెళ్లిపోయిందనేది ప్రచారం ఉంది. 106 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆ రైలు ఒక గుహలో వెళ్ళగానే మాయమైపోయి, చివరికి మెక్సికోలో తేలింది అని.. అక్కడ కనిపించిన ప్యాసింజర్లు ని మెక్సికో అధికారులు మీరు ఎక్కడ నుండి వచ్చారని అడగగా.. ఇటలీ అని చెప్పారు. అప్పట్లో ఇటలీకి రైల్ రూట్ లేకపోవడంతో వాళ్ళందరనీ పిచ్చోళ్ళని భావించి మెంటల్ హాస్పిటల్ ఆ ప్యాసింజర్లు ని పంపించారు. ఇప్పుడు ఇదే కథని రాధేశ్యామ్ కథకి లింక్ పెట్టి మాట్లాడుతున్నారు. మరి రాధేశ్యామ్ షూటింగ్ ఎక్కువగా ఇటలీలో జరగడం, అలాగే యువి క్రియేషన్స్ వారు ఓ హాస్పిటల్ సెట్ వేయించడం చూసిన వారు రాధేశ్యామ్ కథకి ఆ ఇటలీ రైల్ కథకి పక్కాగా సరిపోతుంది అంటున్నారు.