Advertisement
Google Ads BL

పుష్ప రాజ్ రేంజ్ చూసారా..


అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా ఫిలిం పుష్ప మూవీ డిసెంబర్ 17 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇప్పటికే విడుదలైన పుష్ప సాంగ్స్, టీజర్, పోస్టర్స్ అన్ని అద్భుతంగా ఉండడం.. సినిమాలోని హీరో - హీరోయిన్స్, ఇతర కీలక పాత్రల లుక్స్ ఆకట్టుకునేలా ఉండడం, ఇంకా ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చెయ్యడంతో సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు పుష్ప ఇతర భాషల రిలీజ్ చూస్తే ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ అంటే ఇతర భాషా ప్రేక్షకులకి భీభత్సమైన క్రేజ్. తమిళ, మలయాళం, కన్నడలోనే కాదు.. బాలీవుడ్ లో అయితే అల్లు అర్జున్ డాన్స్ కి సెలెబ్రిటీస్ ఫాన్స్ అయ్యారు.

Advertisement
CJ Advs

సో అటు హిందీలోనూ అల్లు అర్జున్ క్రేజ్ మాములుగా లేదు. దానికి అనుగుణంగానే పుష్ప మూవీ అన్ని భషాల్లో భారీగా రిలీజ్ కాబోతుంది. హిందీలో నిన్నమొన్నటివరకు పుష్ప రిలీజ్ పై అనుమానులున్నా .. తాజాగా పుష్ప హిందీ రిలీజ్ భారీ స్థాయిలో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక తమిళంలో పుష్ప సినిమా రిలీజ్ హక్కులను క్రేజీ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్ దక్కించుకుంది. తమిళంలో 5కోట్ల నుంచి 7కోట్ల మధ్యలో పుష్ప హక్కులు అమ్ముడైనట్లు సమాచారం. మలయాళంలో బన్నీకి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. అక్కడ కేరళలో పుష్ప 200 ప్లస్ థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్టుగా టాక్. కన్నడలో అల్లు అర్జున్ ప్రతి సినిమా ఆడేస్తుంది. పుష్ప కి అక్కడ ఎదురే లేదు. సో.. ఈ రేంజ్ లో పుష్ప డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Allu Arjun Pushpa high demand in Tamil:

Allu Arjun Pushpa high demand in Tamil and Malayalam theatrical business
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs