Advertisement
Google Ads BL

అఫీషియల్: గాడ్ ఫాదర్ లో నయనతార


చిరంజీవి - మోహన్ రాజా కాంబోలో మలయాళ హిట్ ఫిలిం లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ శరవేగంగా జరిగిపోతుంది. అయితే ఈ సినిమాలో మొదటి నుండి చిరు సిస్టర్ గా నయనతార నటిస్తుంది అనగానే ఎందరో షాకయ్యారు.. స్టార్ హీరోయిన్స్ చిరుకి సిస్టర్ అంటే నిజంగా షాకింగే. మధ్యలో నయనతార గాడ్ ఫాదర్ లో సిస్టర్ కేరెక్టర్ లో నటించినందుకు కండిషన్స్ పెట్టింది అని, సత్య దేవ్ లో మరో హీరోని పెట్టమని, రెమ్యునరేషన్ విషయం లో కండిషన్స్ పెట్టింది అని అన్నారు. ఇక తాజాగా చిరు సిస్టర్ గా నయన్ కాదు రమ్యకృష్ణ నటిస్తుంది అని.. అన్నారు.

Advertisement
CJ Advs

అయితే గాడ్ ఫాదర్ లో నయనతార చిరంజీవి చెల్లెలిగా నెగెటివ్ కేరెక్టర్ లో నటిస్తుంది అని.. అఫీషియల్ గా గాడ్ ఫాదర్ టీం ప్రకటించింది. నయనతార బర్త్ డే రోజున నయనతారకి గాడ్ ఫాదర్ టీం విషెస్ చెప్పడంతో నయన్ అఫీషియల్ గా గాడ్ ఫాదర్ లో నటిస్తున్నట్టుగా ప్రకటించేసారు. గాడ్ ఫాదర్ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. అందులోనూ ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ చిరు బాడీ గార్డ్ గా స్పెషల్ రోల్ చేస్తున్నారు. చిరు-సల్మాన్ ఖాన్ కాంబోలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుంది అని అంటున్నారు.

Godfather team wishes Nayanthara :

Godfather greets on Nayanatara birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs