Advertisement
Google Ads BL

మా చెల్లెలు జ్యోతిర్మయి పెద్ద డాక్టర్‌ అవుతుంది


ప్రముఖ నటుడు సాయికుమార్‌ కుమార్తె, హీరో ఆది సోదరి ప్రముఖ చిన్నపిల్లల వైద్యురాలు డాక్టర్‌ జ్యోతిర్మయి యం.డి చెరిష్‌ చిల్డ్రన్స్‌  క్లినిక్‌ను హైదరాబాద్‌లోని  కొండాపూర్‌ నందు లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ యం.పి, రెయిన్‌ బో హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ రమేశ్‌ కంచర్ల, ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ ముఖర్జీ, ప్రముఖ న్యూరాలజిస్ట్‌  డాక్టర్‌ శ్రీకాంత్‌ వేమూరి, నటుడు  డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్, లవ్‌లీ హీరో ఆది సాయికుమార్, నటుడు తనికెళ్ల భరణి,  తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా యంపీ సంతోశ్‌ కుమార్‌ మాట్లాడుతూ– సాయికుమార్‌ గారు నాకు వ్యక్తిగతంగా  మంచిమిత్రులు. మా చెల్లెలు జ్యోతిర్మయి ఓపెన్‌ చేసిన చెరిష్‌ క్లినిక్‌ చక్కని విజయం సాధించి డాక్టర్‌గా మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నా అన్నారు. 

రెయిన్‌ బో వ్యవస్థాపకులు రమేశ్‌ గారు మాట్లాడుతూ–ప్రస్తుత సమాజంలో ఇటువంటి క్లినిక్‌లు ఎంతో అవసరం. ముఖ్యంగా కోవిడ్‌ తర్వాత ఇంతటి విశాలమైన ప్లేస్‌లో క్లినిక్‌ ఉండటం అనేది ఈ ఏరియాకు సంబంధించిన వారందరికి అవసరం. ఒక డాక్టర్‌గా జ్యోతిర్మయి ఏర్పాటు చేసిన క్లినిక్‌ను చూసి ఆనందంగా ఉంది.

 ముఖర్జీ మాట్లాడుతూ–మన ఇంట్లో పిల్లలు పెరిగినట్లే చెరిష్‌ క్లినిక్‌ కూడా పెరిగి పెద్దదవుతుంది అన్నారు. 

డాక్టర్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూనేను ఎంత పెద్ద డాక్టర్‌ అయినా ఒక తండ్రిగా మాత్రం నా పిల్లలకు ఏమన్నా ప్రాబ్లం రాగానే ఏ డాక్టర్‌ దగ్గరికి వెళ్లాలి అని ఆలోచిస్తాను.లక్కీగా కొండాపూర్‌ ఏరియాలో  చిన్నపిల్లల క్లినిక్‌  పెట్టడం ఆనందంగా ఉంది అన్నారు. 

సాయికుమార్‌ మాట్లాడుతూ మా అమ్మ కల ఈ రోజు మా అమ్మాయి డాక్టరై నెరవేర్చింది. డాక్టర్‌గానే  కాకుండా పిల్లల్ని ఒక తల్లిలా చూసుకోవాలనేదే నా ఆశఅన్నారు. 

హీరో ఆది మాట్లాడుతూ– జ్యోతి మా చెల్లెలు అనే కాదు. ఆమె డాక్టర్‌గా ఎంతోమందికి సేవ చేసినప్పుడు వాళ్ల దగ్గరినుండి వచ్చిన రివ్యూస్‌ చూసి చాలా హ్యాపీగా అనిపించేదిఅన్నారు.  

కృష్ణ ఫల్గుణి మాట్లాడుతూ– నా భార్య జ్యోతిని చూసి చాలా గర్వంగా ఉందిఅన్నారు. 

చెరిష్‌ క్లినిక్‌ యండి డాక్టర్‌ జ్యోతిర్మయి మాట్లాడుతూ–నేను  కోవిడ్‌ టైమ్‌లో ఎంతోమంది పిల్లలకి వీడియో ద్వారా ట్రీట్‌మెంట్‌ చేశాను. చాలామంది తల్లితండ్రులకు వాళ్ల పిల్లలకి ఎంత మోతాదులో మందు వేయాలో కూడా తెలియదు. నా క్లినిక్‌కి వచ్చే పిల్లలు ఆసుపత్రికి వచ్చాము అనే ఫీల్‌ లేకుండా అన్ని సౌకర్యాలను ఫీలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నన్ను ఆశీర్వదించటానికి వచ్చిన పెద్దలందరికి అభినందనలు తెలుపుతున్నా అన్నారు.

Cherish Children Clinic Opening:

Sai Kumar daughter Jyotirmayi Cherish Children Clinic Opening
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs