మూడు సినిమాల తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అక్కినేని యంగ్ హీరో అఖిల్.. తన తదుపరి మూవీ ఏజెంట్ షూటింగ్ ని పరిగెత్తిస్తున్నాడు. పూజ హెగ్డే తో బ్యూటిఫుల్ గా రొమాన్స్ తో ఆకట్టుకున్న అఖిల్.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో చాలా స్టైలిష్ గా అమ్మాయిల మనసులు దోచేశాడు. అఖిల్ ఈ సినిమాలో మోస్ట్ స్టైలిష్ గా కనిపించాడంటున్నారు. ఇక ఏజెంట్ మూవీలో అఖిల్ మాస్ అవతార్ లో కనిపిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఈ మూవీ చేస్తున్నాడు. సిక్స్ ప్యాక్ లుక్ లో అఖిల్ మాస్ లుక్ ఆకట్టుకునేలా ఉంది.
స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీ కథ ప్రకారం మేజర్ భాగం షూటింగ్ ని విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టులలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రమోషన్స్ ముగించిన అఖిల్ ఇమ్మిడియట్ గా ఏజెంట్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా యూరప్ లోని బడా ఫెస్ట్ లో మేజర్ షెడ్యూల్ షూటింగును చిత్రీకరించారు. ఇప్పుడు యూరప్ లోని బడా ఫెస్ట్ లో సుగెంట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న టీం.. తిరిగి హైదరాబాద్ కి వచ్చేసింది. ఏజెంట్ తదుపరి షెడ్యూల్.. హైదరాబాద్ లోనే జరగనుంది.. ఈ సినిమాలో మలయాళ నటుడు మమ్ముట్టి కీ రోల్ పోషిస్తుండగా.. ముంబై మోడల్ సాక్షి వైద్య హీరోయిన్ గా టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అవుతుంది.