Advertisement
Google Ads BL

షాకింగ్: సుశాంత్ సింగ్ ఫ్యామిలీలో 5గురు దుర్మరణం


గత ఏడాది జూన్ లో సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ తన ఫ్లాట్ లోనే సూయిసైడ్ చేసుకుని హఠాన్మరణం చెందాడు. ఆయన చనిపోయిన దగ్గర నుండి సుశాంత్ సింగ్ కేసు.. ఈనాటి వరకు తేలలేదు. అది హత్యా, ఆత్మహత్య అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. ఈ కేసు నుండి బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు బయటపడింది.. దానిలో సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ రియా జైలుకి కూడా వెళ్ళొచ్చింది. అయితే తాజాగా ఈ రోజు నవంబర్ 16 ఉదయం సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సుశాంత్ సింగ్ ఫ్యామిలిలో ఐదుగురు రోడ్డు ఆక్సిడెంట్ లో దుర్మరణం పాలవడం అందరిని దిగ్బ్రాంతికి గురి చేసింది. బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో జాతీయ రహదారి పై 10 మందితో ప్రయాణిస్తున్న వాహనం ట్రక్కును ఢీ కొనడంతో సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యులు మరణించారు. 

Advertisement
CJ Advs

10 మందితో ప్రయాణిస్తున్న వాహనంలో ఆరుగురు అక్కడకిక్కడే మరణించగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సుశాంత్ సింగ్ ఫ్యామిలీ మెంబెర్స్ అంతా హర్యానా సీనియర్ పోలీసు అధికారి OP సింగ్ సోదరి గీతా దేవి అంత్యక్రియలకు వెళ్లి పాట్నా నుంచి తిరిగి వస్తున్నారు. సుశాంత్ సింగ్ కు OP సింగ్ స్వయానా బావ. హల్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్రా సమీపంలో మిడిల్ స్కూల్ సమీపంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు చనిపోగా.. అందులో ఐదుగురు సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యులు ఉండడం అందరిని తీవ్ర ఆవేదానికి గురి చేసింది. 

 

Shocking: 5 killed in Sushant Singh Rajput family:

Sushant Singh Rajput family 5 members killed in Bihar road accident
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs