Advertisement
Google Ads BL

ఆర్.ఆర్.ఆర్ కి భయపడేదేలే..


రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కి భయపడి చాలామంది హీరోలు వెనక్కి తగ్గారు.. తగ్గుతున్నారు. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ని జనవరి 7న ఫిక్స్ చేసి రిలీజ్ డేట్ ఇవ్వగానే.. సంక్రాంతి సినిమాలపై రూమర్స్ మొదలైపోయాయి. అందులోనూ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, మహేష్ సర్కారు వారి పాట వెనక్కి తగ్గుతాయని ప్రచారం మొదలైనట్లుగానే మహేష్ బాబు కూల్ గా ఏప్రిల్ కి సర్కారు వారి పాటని షిఫ్ట్ చేసేసాడు. మరోపక్క పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కూడా రిలీజ్ డేట్ మార్చెయ్యబోతుంది అనే ప్రచారం గట్టిగానే జరిగింది. ఇక నిన్న సోమవారం బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తన సినిమా గంగూభాయ్ కతీయవాది ని ఫిబ్రవరికి మార్చేసి.. ఆర్.ఆర్.ఆర్ కి దారిచ్చేసారు. ఇక ప్రభాస్ రాధేశ్యామ్ మాత్రం సంక్రాంతికే ఫిక్స్ అయ్యింది.

Advertisement
CJ Advs

ఆర్.ఆర్.ఆర్ పై పోటీకి వెళ్లడం ఎందుకు అని కామ్ అయ్యారు చాలామంది. కానీ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మాత్రం ఆర్.ఆర్.ఆర్ కి భయపడేదేలే అంటున్నారు. ఎందుకంటే తాజాగా ఈ మంగళవారం భీమ్లా నాయక్ నుండి అప్ డేట్ ఇచ్చింది టీం. సంక్రాంతి కి అంటే జనవరి 12 న భీమ్లా నాయక్ థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది అంటూ మరోసారి అప్ డేట్ ఇచ్చి.. భీమ్లా నాయక్ డేట్ మార్పు రూమర్స్ కి చెక్ పెట్టారు. మరి ఎవ్వరు తగ్గినా.. భీమ్లా నాయక్ తగ్గేదెలా అంటూ.. మేకర్స్ మరోసారి ఈ రిలీజ్ డేట్ ని కన్ ఫర్మ్ చేసేసారు. 

Bheemla Nayak taking charge this Sankranthi at theatres near you:

Bheemla Nayak Release date confirmed once again
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs