Advertisement
Google Ads BL

లెజెండ్ vs లైగర్


పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటిస్తున్న లైగర్ పాన్ ఇండియా ఫిలిం పై పాన్ ఇండియా మార్కెట్ లోనే భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ కూడా లైగర్ మూవీని ప్రొడ్యూస్ చెయ్యడంతో.. బాలీవుడ్ లోను ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. కరణ్ జోహార్ అనే కాదు.. విజయ్ దేవరకొండ కి బాలీవుడ్ లో సెలెబ్రిటీ ఫాలింగ్ భీభత్సమే. అందుకే అక్కడ కూడా లైగర్ తో జెండా పాతడానికి విజయ్ దేవరకొండ రెడీగా ఉన్నాడు. ప్రస్తుతం లైగర్ టీం యుఎస్ లో సందడి చేస్తుంది. నాలుగు రోజుల క్రితమే లైగర్ టీం యుఎస్ బయలుదేరి వెళ్ళింది. అయితే ఈ రోజు అంటే మంగళ వారం నుండి లైగర్ యుఎస్ షెడ్యూల్ బిగిన్ అయినట్లుగా టీం అప్ డేట్ ఇచ్చింది.

Advertisement
CJ Advs

ఈ యుఎస్ షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ తో లెజెండ్ మైక్ టైసన్ పోటీ పడబోతున్నారు అని, అంటే లెజెండ్ vs లైగర్ అన్నట్టుగా లైగర్ యుఎస్ షెడ్యూల్ చిత్రకరణ జరగబోతున్నట్టుగా టీం అప్ డేట్ ఇచ్చింది. పోస్టర్‌లో విజయ్ దేవరకొండ, మైక్ టైసన్‌లు నవ్వుతూ కనిపించారు. కానీ ఒక్కసారి డైరెక్టర్ యాక్షన్ అని చెబితే మాత్రం సీన్ మారిపోతుంది. ఈ ఇద్దరూ కలిసి చేసే యాక్షన్ సీక్వెన్స్‌ అంచనాలు మించేలా ఉంటాయి.

ఒకరికొకరు వారు ఎదురుపడితే అగ్గి రాజుకున్నట్టే..  ది లెజెండ్ వర్సెస్ లైగర్ ఫైటింగ్ సీక్వెన్స్ మొదలు అంటూ చిత్రయూనిట్ తెలిపింది. మైక్ టైసన్‌తో కలిసి ఉన్న ప్రతీక్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. మెమోరీస్‌గా గుర్తు పెట్టుకుంటున్నాను. అవి ఎప్పటికీ నాకు ప్రత్యేకమే అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.

లైగర్‌లో ఎంతో మంది విదేశీ ఫైటర్లు కూడా ఉన్న సినిమాలో ఈ యుఎస్ ఎపిసోడ్ హైలెట్ అనేలా ఉండబోతుంది అని అంటున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా, సునీల్ శెట్టి, రమ్యకృష్ణ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ యుఎస్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక లైగర్ రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వస్తుంది. 

The Legend vs Liger:

Liger USA schedule Begins 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs