టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్లేస్ పై ఎప్పటినుండో ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మహేష్ - పవన్ కళ్యాణ్ -ప్రభాస్ అంటూ ఆ స్థానం ఎవరి దగ్గర ఆగడం లేదు. ప్రభాస్ పాన్ ఇండియాకి వెళ్లిపోగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కోసం సినిమాలకి బ్రేక్ ఇవ్వడంతో.. సూపర్ స్టార్ మహేష్ హవా పెరిగిపోయింది. ఇక మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ పాపులర్ సర్వే కంపెనీ ఆర్మాక్స్ మీడియా ప్రతి నెల మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ సర్వే నిర్వహిస్తుంది. ఈ సర్వే లో గత పది నెలలుగా మహేష్ బాబే నెంబర్ వన్ లో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ పదకొండవ నెలలోనూ మహేష్ మరోసారి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాటలో నటిస్తున్నాడు. తర్వాత త్రివిక్రమ్, రాజమౌళి సినిమాల్లో నటిస్తాడు.
ఇక ఆర్మాక్స్ మీడియా మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ కేటగిరిలో సెకండ్ ప్లేస్ ని మళ్ళీ అల్లు అర్జున్ కైవసం చేసుకోగా.. థర్డ్ ప్లేస్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నాడు. అయితే పాన్ ఇండియా మూవీ తో మంచి క్రేజ్ లో ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ లను దాటి పవన్ కళ్యాణ్ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఐదో స్థానాన్ని, నేచురల్ స్టార్ నాని ఆరో స్థానంలోనూ, రామ్ చరణ్ ఏడో స్థానాన్ని, ఎనిమిదో స్థానాన్ని లైగర్ విజయ్ దేవరకొండ, తొమ్మిదో స్థానంలో మెగాస్టార్ చిరు ఉండగా.. పదో స్థానంలో నాగ చైతన్య ఉన్నాడు. మరి పదకొండు నెలలుగా మహేష్ బాబు టాప్ వన్ లో సత్తా చాటుతున్నాడు.