Advertisement
Google Ads BL

ప్రభాస్ ఫాన్స్ సహనానికి పరీక్ష


అసలే రాధేశ్యామ్ అప్ డేట్స్ కోసం ప్రభాస్ ఫాన్స్ మొహం వాచి పోయి ఉన్నారు. యూవీ క్రియేషన్స్ వారేమో.. ఆచి తూచి ప్రభాస్ రాధేశ్యామ్ అప్ డేట్స్ ఇస్తారు. ఇక సంక్రాంతి టార్గెట్ తో రెడీ అవుతున్న రాధేశ్యామ్ ప్రమోషన్స్ కోసం ప్రభాస్ ఫాన్స్ పిచ్చగా వెయిట్ చేస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా రాధేశ్యామ్ హాష్ టాగ్ తో ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా లేదు. అసలే పాన్ ఇండియా స్టార్. ఆ క్రేజ్ వరల్డ్ వైడ్ గా ఎంతుంటుంది.. అదే క్రేజ్ రాధేశ్యామ్ కి ఉంది. ఇక నవంబర్ 15 రాధేశ్యామ్ సింగిల్ అంటూ డేట్ ఇచ్చేసారు.

Advertisement
CJ Advs

అలాగే ఈ రోజు నవంబర్ 15 న రాధేశ్యామ్ సింగిల్ ని సాయంత్రం 5 గంటలకి రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా అప్ డేట్ ఇచ్చారు. కానీ 5 గంటలకి రాధేశ్యామ్ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయలేదు. ఇక 8 గంటలకి అప్ డేట్ అన్నారు, స్టే ట్యూన్ అంటూ పీఆర్వో లు అప్ డేట్స్ ఇస్తూ ప్రభాస్ ఫాన్స్ సహనానికి పరీక్ష పెట్టారు. ఎట్టకేలకి రాధేశ్యామ్ సింగిల్ ఈ రాతలే ని రిలీజ్ చేసారు.. యువన్‌ శంకర్‌ రాజా, హరిణి ఇవటూరి పాడిన ఈ పాటకి జస్టిన్‌ ప్రభాకరన్‌ మ్యూజిక్ అందించారు. ఈ సాంగ్ విక్రమాదిత్య - ప్రేరణ మధ్యలో సాగుతుంది.. విజువల్వండర్ లా కనిపిస్తున్న ఈ సాంగ్ తో ప్రభాస్ ఫాన్స్ పాడిన కష్టాన్ని ఇట్టే మరిచిపోయి.. రాధేశ్యామ్ ఫస్ట్ సింగిల్ తో పండగ చేసుకుంటున్నారు.

Radhe Shyam First Single Lyrical Video is out now:

Prabhas Radhe Shyam First Single Lyrical Video is out now
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs