పూజ హెగ్డే ప్రస్తుతం బిజీ తార. స్టార్ హీరోలకు కేరాఫ్ అడ్రెస్స్ గా మారిన పూజ హెగ్డే హవా టాలీవుడ్ లో మాములుగా లేదు.. బుట్ట బొమ్మ అంటూ టాలీవుడ్ ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన పూజ హెగ్డే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఇక మహేష్ బాబు తో మొదలు కాబోతున్న SSMB28 షూటింగ్ కోసం వెయిటింగ్. మరోపక్క విజయ్ బీస్ట్ షూటింగ్ నుండి కాస్త బ్రేక్ దొరకడంతో.. పాప మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ పూజ హెగ్డే మాములుగా ఎంజాయ్ చెయ్యడం లేదు.. సముద్రంలో విహరించడమే కాదు.. పూల్ లాంచ్ అంటూ నీటిలో తేలియాడుతూ.. ఇష్టమైన ఫుడ్ ని ఎంజాయ్ చేస్తుంది. బికినీ షోస్ తో హీటెక్కిస్తోంది.
ప్రస్తుతం పూజ హెగ్డే మాల్దీవుల పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి పూజ హెగ్డే మాల్దీవులకు ఒంటరిగా వెళ్లిందో లేదంటే.. ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లిందో తెలియదు కానీ.. అమ్మడు మాత్రం మాల్దీవుల్లో చేసే ఎంజాయ్మెంట్ మాత్రం యూత్ కి నిద్రలేకుండా చేస్తుంది. ఇక బుట్టబొమ్మ పూజ హెగ్డే బాలీవుడ్ లోనూ జెండా పాతేసింది.. ఇక అక్కడ కూడా టాప్ రేంజ్ కోసం వెయిటింగ్.