Advertisement
Google Ads BL

కన్ ఫర్మ్: పుష్పలో సమంత స్పెషల్ సాంగ్‌..


అల వైకుఠ‌పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్  ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి, సామి సామి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

Advertisement
CJ Advs

ఇక నవంబర్ 19న ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అంటూ సాగే నాలుగో సింగిల్‌ విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో స్టార్ హీరోయిన్ సమంత కాలు కదపనున్నారు. పుష్ప 5వ పాట మరింత స్పెషల్‌గా ఉండబోతుంది.. సమంత గారి ఎంట్రీతో ఆ పాట మరింత స్పెషల్ అయిపోయింది అంటూ చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ విడుదల చేసారు. కెరీర్‌లో మొదటి సారి స్పెషల్ సాంగ్ చేయబోతున్నారు సమంత. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

Pushpa makers welcome Samantha :

Pushpa makers welcome Samantha on board for the special song
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs