శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అస్లీల చిత్రాల కేసులో జైలు లో ఉండి బెయిల్ పై విడుదలయ్యాడు. ఇంకా ఆ కేసు కోర్టులో ఉండగానే ఆ శిల్పా శెట్టి - రాజ్ కుంద్రా దంపతులపై మరో చీటింగ్ కేసు నమోదు అవడం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ దంపతులు దాదాపుగా 1.51 కోట్ల మేర ఫోర్జరీ, చీటింగ్ చేశారనే ఆరోపణలతో శిల్పా - రాజ్ లపై కేసు నమోదు అయ్యింది. అయితే ఈ చీటింగ్ కేసుపై శిల్పా శెట్టి స్పందించింది. తనపై వచ్చిన ఫోర్జరీ, చీటింగ్ ఆరోపణలను ఆమె ఖండించింది. ఖషీష్ ఖాన్ చెప్పినట్టుగా తాను తన భర్త ఎలాంటి చీటింగ్ చెయ్యలేదు అని, ఖషీష్ ఖాన్ నిర్వహించే ఎస్ఎఫ్ఎల్ ఫిట్‌నెస్ సెంటర్ ఆర్థిక లావాదేవీలు, ఖాతా పుస్తకాలన్నీ సరిగానే ఉన్నాయి.
మాపై ఎఫ్‌ఐఆర్ నమోదైందనే వార్తతో నిద్రలేచి షాకయ్యాం. మేము చేసిన డీల్స్ అన్ని ఖషీష్ ఖాన్ వలనే బ్రేక్ అయ్యాయి. బ్యాంకు లావాదేవీల విషయంలో ఖషీష్ ఖాన్ నే బాద్యుడు. తాము ఎలాంటి చీటింగ్ చెయ్యలేదని.. ఇండస్ట్రీ లో గత కొన్నేళ్లుగా పరువు ప్రతిష్టలతో ఉన్నామని, ఇలాంటి ఆరోపణల వలన తమ పరువుకు భంగం వాటిల్లుతుంది.. నేను చట్టాలను గౌరవించే వ్యక్తిని. ఇలాంటి ఆరోపణలన్నీ కేవలం పబ్లిసిటీ కోసమే అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.