టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అంటే అందరూ నిస్సందేహంగా రాజమౌళి పేరే చెబుతారు.. అదే విధంగా హిస్టారికల్ మూవీస్ తో బాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా మారిన సంజయ్ లీల భన్సాలీ కి కూడా విపరీతమైన క్రేజ్ ఉంది.. అలాంటి టాప్ డైరెక్టర్స్ ఇద్దరూ జనవరి మొదటి వారంలో తమ తమ సినిమాలతో పోటీ పడడం అందరికి షాకిచ్చింది. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ మూవీ ని జనవరి 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చెయ్యబోతుంటే.. సంజయ్ లీల భన్సాలీ - అలియా భట్ ల గంగూభాయ్ కతీయవాది మూవీ ని జనవరి 6న రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా ప్రకటించగానే ఇద్దరు టాప్ డైరెక్టర్స్ మధ్యన పోటీ అలాగే అలియా భట్ కూడా ఆర్.ఆర్.ఆర్ - గంగూభాయ్ కతియావాదితో తనకి తానే పోటీ పడబోతోంది అని అనుకున్నారు. అయితే ఆర్.ఆర్.ఆర్ కి దారిస్తూ ఇప్పటికే మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీని సంక్రాతి బరి నుండి తప్పించాడు.
ఇక తాజాగా సంజయ్ లీలా భన్సాలీ కూడా తన గంగూభాయ్ కడియవాది మూవీ రిలీజ్ డేట్ ని మార్చేశారు. అది కూడా ఆర్.ఆర్.ఆర్ కోసమే.. అంటే టాప్ డైరెక్టర్ రాజమౌళి కోసం మరో టాప్ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీ వెనక్కి తగ్గారు.. ఆర్.ఆర్.ఆర్ మీద పోటీ ఎందుకు అనుకున్నారో.. ఏమో అలియా భట్ గంగూభాయ్ కతీయవాది ని ఫిబ్రవరి 18న వరల్డ్ వైడ్ రిలీజ్ అంటూ డేట్ చేంజ్ చేసారు. దానితో ఆర్.ఆర్.ఆర్ డైరెక్టర్ రాజమౌళి తన సినిమా ఆర్.ఆర్.ఆర్ కి దారి ఇచ్చినందుకు గాను.. సంజయ్ లీలా భన్సాలీకి హార్ట్ ఫుల్ గా థాంక్స్ చెప్పడమే కాదు.. గంగూభాయ్ కతీయవాది టీం మూవీ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు రాజమౌళి.