Advertisement
Google Ads BL

శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలపై మరో కేసు


అస్లీల చిత్రాల కేసులో ఈమధ్యనే జైలు నుండి బెయిల్ పై బయటికి వచ్చిన రాజ్ కుంద్రా.. సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పి కామ్ గా ఉంటున్నాడు. మీడియా కంటపడకుండా జాగ్రత్త పడుతున్నాడు. శిల్పా శెట్టి.. మాత్రం యధావిధిగా తన పనులు చేసుకుంటుంది. పిల్లలతో ఎంజాయ్ చెయ్యడం.. ఇలా శిల్ప శెట్టి నార్మల్ గా మారిపోయింది. అయితే రాజ్ కుంద్రా అస్లీల చిత్రాల కేసు ఆలా ఉంచి.. ఇప్పుడు శిల్ప శెట్టి - రాజ్ కుంద్రాలపై మరో చీటింగ్ కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది. నితిన్ అనే వ్యక్తి పూణేలోని కోరేగావ్ ప్రాంతంలో తన కంపెనీ ఫ్రాంచైజీని తీసుకుని స్పా, జిమ్‌ను తెరిస్తే ఎన్నో లాభాలు ఉంటాయని శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలు తమకు నమ్మకం కలిగించి తమని  చీటింగ్ చేసారంటూ నితిన్ పోలీస్ లకి ఫిర్యాదు చేసాడు.

Advertisement
CJ Advs

తాను దాదపుగా 1.59 లక్షలు పెట్టుబడి పెట్టగా, ఆ తర్వాత ఆ సొమ్మును రాజ్ కుంద్రా, శిల్పా లు ఇంకా కొంతమంది తమ సొంత వ్యాపారం కోసం ఉపయోగించుకున్నారు అని నితిన్ కంప్లైంట్ చేసాడు. ఇప్పుడు తన డబ్బును తిరిగి అడగడంతో తనని రాజ్ అండ్ శిల్పాలు  బెదిరించారని నితిన్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నాడు. మరోపక్క రాజ్ కుంద్రా - శిల్పా శెట్టి లు బగ్లాముఖి ఆలయానికి వెళ్లి అక్కడ తాంత్రిక పూజలు నిర్వహించినట్లుగా చెబుతున్నారు. అయితే శిల్పా శెట్టి అండ్ రాజ్ కుంద్రాలు ఈ తాంత్రిక పూజలు శత్రు నాశనానికి, బాధలు తొలగేందుకు చేశారని అంటున్నారు. ప్రస్తుతం ఆ ఆలయం నుండి లీకైన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Cheating case filed against Shilpa Shetty and Raj Kundra:

FIR registered against Shilpa Shetty, Raj Kundra in money scam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs