Advertisement
Google Ads BL

ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ వివరణ


రాజమౌళి దర్శకత్వంలో ఇద్దరు స్టార్ హీరోలు నటించిన ఆర్.ఆర్.ఆర్ సినిమాని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. జనవరి 7 2022 న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆగష్టు లోనే రిలీజ్ అవ్వాల్సిన ఆర్.ఆర్.ఆర్ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ ఓపెన్ అవ్వకపోవడంతో పోస్ట్ పోన్ చేసిన మేకర్స్.. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పై కోర్టు కి వెళ్ళబోతున్నారని, ఏపీ ప్రభుత్వం టికెట్స్ రేట్స్ విషయంలో ఏదైనా అలోచించి నిర్ణయం తీసుకోకపోతే.. పెద్ద సినిమాల నిర్మాతలు కోర్టుకి వెళ్లే యోచనలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది.. అందులోను ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకి వెళ్ళబోతున్నట్లుగా సోషల్ మీడియాలో న్యూస్ లు చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
CJ Advs

అయితే తాజాగా ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ ఈ కోర్టు మేటర్ విషయంలో స్పందిస్తూ.. అవన్నీ రూమర్స్ అని, తాము టికెట్ రేట్స్ విషయంలో కోర్టుకెక్కే ప్ర‌స‌క్తే లేద‌ని ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ అండ్ యూనిట్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. టికెట్ రేట్లు త‌గ్గించ‌డం వ‌ల్ల‌.. కొంత ఇబ్బంది ఉంద‌ని, నిర్మాతలు లాస్ అవుతారు కాబట్టి మరోసారి ఏపీ ప్రభుత్వం దగ్గర తాము మొరపెట్టుకుంటామని, అలాగే తాము ఎంతగా నష్టపోతున్నామో ప్రభుత్వానికి వివరిస్తున్నాం కానీ.. ఈ విషయం పై కోర్టుకి వెళ్లే ప్రసక్తి లేనట్టుగా చెప్పారు. త్వరలోనే ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ ఏపీ ప్రభుత్వం తో మీటింగ్ కి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. 

RRR makers clarify on approaching court :

RRR makers clarify on approaching court against AP government decision
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs