హీరోయిన్స్ గా కాంపిటీటర్స్ గా ఉన్నా.. చాలామంది హీరోయిన్స్ మంచి ఫ్రెండ్స్ గా మారతారు. కీర్తి సురేష్ - సమంత మంచి ఫ్రెండ్స్. అలాగే శృతి హాసన్ - తమన్నాలు మంచి ఫ్రెండ్స్. తమన్నా - శృతి హాసన్ లు పార్టీలకి, ఫంక్షన్స్ కి కలవడమే కాదు.. వారిద్దరూ పర్సనల్ గాను కలిసి మంచి ఫ్రెండ్ షిప్ ని పంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ ఫ్రెండ్స్ కలిసి ఒకేసారి సీనియర్ హీరోలతో సినిమాలు చెయ్యబోతున్నారు. అందులో తమన్నా ఈమధ్యనే చిరంజీవి భోళా శంకర్ మూవీలో హీరోయిన్ గా ఎంపికవడం, అప్పుడే ఆ సినిమా భోళా శంకర్ ఓపెనింగ్ వచ్చెయ్యడం జరిగిపోయింది. ఈ సినిమాలో చిరు తో తమన్నా రొమాన్స్ చేయబోతుంది.
ఇక శృతి హాసన్ కూడా మరో సీనియర్ హీరో బాలకృష్ణ తో జోడి కట్టబోతుంది. గోపీచంద్ మలినేని - బాలయ్య NBK107 లో శృతి హాసన్ ని హీరోయిన్ గా ఎంపిక చేసిన మేకర్స్ ఈ మధ్యనే అఫీషియల్ గా ప్రకటించారు కూడా. ఈ సినిమా కూడా ఓపెనింగ్ తో మొదలైపోయింది. శృతి హాసన్ NBK107 ఓపెనింగ్ పూజా లో పాల్గొంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో హిట్స్ కొడుతున్న శృతి హాసన్ బాలకృష్ణ తో నటించడం షాక్ ఇచ్చే అంశమే. తమన్నా ఎలాగూ సీనియర్ హీరోయిన్స్ లిస్ట్ లోకి వెళ్ళింది కాబట్టి చిరు సరసన బాగానే ఉంటుంది. ఆల్రెడీ సై రా నరసింహ రెడ్డిలో తమన్నా చిరు తో కలిసి నటించింది. ఇప్పుడు భోళా శంకర్ లో నటిస్తుంది. మెహెర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సో ఫ్రెండ్స్ ఇద్దరూ ఒకేసారి ఇలా సీనియర్ హీరోలకి ఫిక్స్ అయ్యారు.