అల్లు అర్జున్ - సుకుమార్ కాంబో లో తెరకెక్కుతున్న పుష్ప మూవీ పాన్ ఇండియా లెవల్లో డిసెంబర్ 17 న రిలీజ్ కి సిద్దమవుతుంది. దానితో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేసారు. ఇప్పటికే పుష్ప నుండి రిలీజ్ అయిన సాంగ్స్ మార్కెట్ ని ఊపేస్తున్నాయి. అలాగే పుష్ప రాజ్ లుక్, రష్మిక శ్రీవల్లి లుక్, విలన్ ఫహద్ ఫాసిల్ లుక్, అనసూయ దాక్షాయణి లుక్, సునీల్ లుక్ అన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి . అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా పక్క మాస్ అవతార్ లో కనిపిస్తున్నాడు. బయట కూడా అదే హెయిర్ స్టయిల్ ని, గెడ్డాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. అయితే తాజాగా ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అనే సాంగ్ ని నవంబర్ 19 న రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.
ఈ సాంగ్ డేట్ తో పాటుగా అల్లు అర్జున్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. అసలు అల్లు అర్జునేనా ఆ పిక్ లో ఉన్నది అనిపించేలా అల్లు అర్జున్ మేకోవర్ ఉంది.. మరీ మాస్ గా.. అసలు గుర్తు పట్టలేనంతగా కనిపిస్తున్నాడు అల్లు అర్జున్. అసలు ఈ లుక్ లో అల్లు అర్జున్ ఫాన్స్ కే ఆయన నచ్చలేదు. పుష్ప రాజ్ గా మరీ డీ గ్లామర్ మాస్ అవతార్ ఓకె.. కానీ ఈ సాంగ్ లో అల్లు అర్జున్ లుక్ నచ్చేలేదంటున్నారు నెటిజెన్స్.. ఆ కళ్ళ జోడు, ఆ హెయిర్ స్టయిల్ ఏం బాలేదు అంటున్నారు. మరి పూర్తి సాంగ్ చూస్తే ఎమన్నా అల్లు ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా లో మంచిగా కనిపిస్తాడేమో చూడాలి. సుక్కు మరీ అల్లు అర్జున్ ని మార్చేసాడు .. మరి ఇంతగానా అంటున్నారు నెటిజెన్స్. అల్లు అర్జున్ లేటెస్ట్ లుక్ పై అప్పుడే సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలైపోయాయి.