కంగనా రనౌత్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దేశద్రోహి కంగనా అంటూ హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఎందుకంటే కంగనా తాజాగా ఇండియా కి స్వాతంత్య్రం వచ్చింది 1947లో కాదని... 2014లో మోదీ ప్రధాని అయిన తర్వాతే ఇండియా కి అసలైన స్వాతంత్ర్యం వచ్చిందంటూ చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఎంతగా బిజెపి కి సపోర్ట్ చేస్తే మాత్రం ప్రాణాలకు పోరాడి స్వాతంత్ర్యాన్ని తెచ్చిన అమర వీరులని కించపరుస్తావా కంగనా అంటూ కాజ్ఞపై విరుచుకుపడుతున్నారు. తాను రాణి లక్ష్మీబాయ్ సినిమా చేస్తున్నప్పుడు.. 1857 మొదటి స్వాతంత్య్ర పోరాటంపై అధ్యయనం చేశానని, 1987లో జరిగిన యుద్ధం గురించి తనకు తెలుసని, అయితే 1947లో ఏం జరిగిందనే దాని గురి తనకు ఎవరైనా చెప్పాలని కంగన వాదిస్తుంది.
అంతేకాకుండా సుభాష్ చంద్రబోస్ ఎందుకు చనిపోయారు, భగత్ సింగ్ ను గాంధీ ఎందుకు కాపాడలేకపోయారు, దేశ విభజన రేఖను బ్రిటిష్ వారే ఎందుకు గీశారు, స్వాతంత్య్రం వచ్చినప్పుడు గర్వంగా వేడుకలు జరుపుకోకుండా ఒకరినొకకరు ఎందుకు చంపుకున్నారు.. వీటికి సమాధానాలు చెప్పండి. అలాగే.. నేను అమరవీరులని ఎక్కడైనా కించపరిచాను అని నిరూపిస్తే.. నాకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని అంటూ అడ్డంగా వాదిస్తుంది కంగనా రనౌత్.