కన్నడ స్టార్ హీరో పునీత రాజ్ కుమార్ అకాల మరణంతో టాలీవుడ్ మొత్తం కలిదిలింది. టాలీవుడ్ స్టార్స్ చాలామంది అంటే మెగాస్టార్ దగ్గర నుండి అలీ వరకు పునీత్ భౌతిక కాయాన్ని సందర్శించి కన్నీళ్లతో నివాళులర్పించారు. ఇక పునీత్ దోస్త్ జూనియర్ ఎన్టీఆర్ బెంగుళూరు వెళ్లి స్నేహితుడి భౌతిక కాయం దగ్గర కంటతడి పెట్టుకుని.. పునీత్ అన్నగారు శివ రాజ్ కుమార్ ని గుండెకి హత్తుకుని ఓదార్చారు. ఇక తమ్ముడి మరణంతో కుంగిపోయిన శివ రాజ్ కుమార్.. మొదటిసారి మీడియాతో మట్లాడారు. పునీత్ రాజ్ కుమార్ మరణం మా మొత్తం ఫ్యామిలీని తీవ్ర విషాదంలోకి నెట్టి వేసింది అని చెప్పిన శివ రాజ్ కుమార్.. ఎన్టీఆర్ తనని ఓదార్చిన విషయాన్ని, తనకి అండగా ఉన్న మీడియా ముందు గుర్తు చేసుకున్నారు.
పునీత్ చివరి చూపు కోసం వచ్చిన ఎన్టీఆర్ నన్ను ఓదారుస్తూ.. అన్నా మీకు నేనున్నాను... అంటూ అండగా నిలవడమే కాదు.. తీరని శోకంలో ఉన్న మాకు ఎంతో ధైర్యం చెప్పాడు.. ఆ సమయంలో ఎన్టీఆర్ నాకు ఓ తమ్ముడిలా కనిపించాడు. మొదటి నుండి ఎన్టీఆర్ కి మా ఫ్యామిలీ తో ఎంతో అనుబంధం ఉంది. ఆ సాన్నిహిత్యం ఎప్పటికి కొనసాగుతుంది అంటూ శివ రాజ్ కుమార్ ఎన్టీఆర్ గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు.