Advertisement
Google Ads BL

నితిన్ మాచర్ల నియోజకవర్గం రిలీజ్ డేట్ ఫిక్స్


విభిన్న కథలు చేస్తూ అలరిస్తున్న హీరో నితిన్ ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్నారు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న చిత్రంలో నితిన్‌ను ఫుల్ యాక్షన్ మోడ్‌లో ప్రేక్షకులు చూడబోతోన్నారు. ఆదిత్య మూవీస్ & ఎంటర్ టైన్మెంట్స్ అసోసియేషన్ తో

Advertisement
CJ Advs

శ్రేష్ట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.  మాచర్ల నియోజకవర్గం సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుందని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ఎంతో పవర్ ఫుల్‌గా ఉంది. తన మీదకు దాడి చేసేందుకు వస్తోన్న వారిపై నితిన్ విరుచుకుపడుతుండడం ఈ పోస్టర్లో చూడొచ్చు. వేసవి సెలవులను మాచర్ల నియోజకవర్గం కరెక్ట్ గా ఉపయోగించుకోనుంది.

ఈ  పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాలో పొలిటికల్ అంశాలు హైలెట్ కానున్నాయి. కృతి శెట్టి నితిన్ ప్రేమ కథ కూడా కొత్తగా ఉండబోతోంది.

నితిన్‌ను  ఇది వరకెన్నడూ చూపించని కొత్త అవతారంలో దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి చూపించబోతోన్నారు. ఇంకా ఈ చిత్రంలో ఎంతో మంది ప్రముఖ నటీనటులున్నారు. అద్భుతమైన సాంకేతిక బృందం ఈ సినిమా కోసం పని చేస్తోంది.

భీష్మ, మాస్ట్రో వంటి చిత్రాల తరువాత మూడోసారి మహతి స్వరసాగర్‌తో కలిసి నితిన్ పని చేస్తున్నారు.

Nithiin Macherla Niyojakavargam Releasing Worldwide On..:

Nithiin, MS Raja Shekhar Reddy, Sreshth Movies, Macherla Niyojakavargam Releasing Worldwide On April 29, 2022
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs