Advertisement
Google Ads BL

టీజర్ తో రిలీజ్ డేట్ కన్ ఫర్మ్ చేసిన వెంకీ


మలయాళ సూపర్ హిట్ ఫిలిం దృశ్యం 2 ని విక్టరీ వెంకటేష్ తెలుగులో దృశ్యం 2 గా రీమేక్ చేసారు. మోహన్ లాల్ నటించిన పాత్రలో వెంకటేష్ కనిపించారు. మలయాళంలో సూపర్ హిట్ అవడంతో దృశ్యం 2 పై తెలుగులోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడో ఫస్ట్ కాపీ కూడా రెడీ అయినా దృశ్యం 2 రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఇప్పటివరకు సస్పన్స్ లోనే పెట్టారు. అయితే తాజాగా దృశ్యం 2 నుండి అప్ డేట్ మాత్రమే కాదు.. టీజర్ ని రిలీజ్ చేసారు. ఒరిజినల్ దృశ్యం 2 కి ఏమాత్రం తగ్గకుండా.. తెలుగు దృశ్యం 2 ని జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసారు. 

Advertisement
CJ Advs

ఇక దృశ్యం 2 టీజర్ లోకి వెలితే రాంబాబు కేసు ఎటైనది సర్ అనగా.. రాంబాబు అంటే.. ఆ వరుణ్ కేసులో అని ఎసై అనడం తో ఈ టీజర్ మొదలైంది. ఆరేళ్లుగా మన డిపార్ట్మెంట్ ని వేధిస్తున్న ప్రశ్న ఇది అని కమిషనర్ పాత్రధారి సంపత్ అంటున్నాడు. మీనా - వెంకీ.. వైఫ్ హస్ బండ్ గా కనిపించనున్న ఈ సినిమా టీజర్ లో వెంకీ ఆ చీకటి జ్ఞాపకాల్లోకి మమ్మల్ని మళ్ళీ లాగొద్దు అని అనే డైలాగ్ చెప్పగానే నదియా వెంకీ చెంప చెళ్లుమనిపించడం, నరేష్ ఆపడానికి ట్రై చెయ్యడం.. ఎవ్వరిని వదలను నేను అని నదియా చెప్పే డైలాగ్ అన్ని విజువల్ గాను సూపర్ గా ఉన్నాయి. కేరెక్టర్స్ అలాగే బ్యాగ్ రౌండ్ స్కోర్, జీతూ దర్శకత్వం, సినిమాటోగ్రఫీ అన్ని సినిమాకి హైలెట్ అనేలా ఉన్నాయి.

ఇక దృశ్యం 2 థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ ఓటిటి ద్వారా రిలీజ్ చెయ్యబోతున్నారు. నవంబర్ 25 న దృశ్యం 2 అమెజాన్ ప్రైమ్ నుండి రిలీజ్ కాబోతున్నట్టుగా ఈ టీజర్ ద్వారా ప్రకటించారు మేకర్స్. 

Drishyam 2 Release date and Teaser out:

Venkatesh Drishyam 2 Release date and Teaser out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs