బిగ్ బాస్ సీజన్ 5.. మరో రెండు రోజుల్లో 10 వారలు పూర్తి చేసుకోబోతుంది. ఈ వారం నామినేషన్స్ లో రవి, సిరి, మానస్, సన్నీ, కాజల్ లు ఉన్నారు. అయితే ఈ వారం ఎలిమినేషన్స్ కీలకంగా మారనుంది. ఎందుకంటే నామినేషన్స్ లో గట్టి కంటెస్టెంట్స్ ఉండడంతో.. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా మారనుంది. ఇక విశ్వ వెళుతూ వెళుతూ టాప్ లో శ్రీరామ్ చంద్ర, మానస్, షణ్ముఖ్, రవి, సన్నీ ఉంటారని చెప్పాడు. ఇప్పుడు ఓర్మాక్స్ సంస్థ బిగ్ బాస్ లో ఉన్న 10 మంది కంటెస్టెంట్స్ లో ఎవరు టాప్ 5 కి వెళ్ళబోతున్నారో అనేది సర్వే నిర్వహించింది. బిగ్‌బాస్ షోలో అత్యధికంగా పాపులారిటి సొంతం చేసుకొన్న కంటెస్టెంట్ల జాబితాను ఆ సంస్థ వెల్లడించింది.
ఆ సర్వే ప్రకారం సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్ జస్వంత్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, సెకండ్ ప్లేస్ లో సన్నీ, థర్డ్ ప్లేస్ లో శ్రీరామ చంద్ర, 4th ప్లేస్ లో రవి, 5th ప్లేస్ లో సిరి హన్మంతు ఉన్నారు. వీరు ఐదుగురు టాప్ 5లో ఉండే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ఓర్మాక్స్ సంస్థ వ్యక్తం చేసింది. ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 5 బుల్లితెర ప్రేక్షకులని పెద్దగా మెప్పించలేకపోతుంది. నాగార్జన హోస్ట్ ఎపిసోడ్స్ మాత్రమే అంతో ఇంతో టిఆర్పి ని తెచ్చిపెడుతున్నాయి స్టార్ మాకి. వీక్ డిఎస్ లో బిగ్ బాస్ ఎలాంటి ప్రతాపం చూపించలేకపోతుంది.