Advertisement
Google Ads BL

RC15 సెకండ్ షెడ్యూల్ అప్ డేట్


రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ ప్రమోషనల్ సాంగ్స్ తో అదరగొట్టేస్తున్నాడు. నాటు నాటు అంటూ ఆర్.ఆర్.ఆర్ సాంగ్ లో ఎన్టీఆర్ తో కలిసి వేసిన మాస్ స్టెప్స్ కి మెగా ఫాన్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులంతా అద్భుతంగా ఫీలవుతున్నారు. మరోపక్క నీలాంబరి సాంగ్ లో ర చరణ్ క్లాసికల్ స్టెప్స్ కి కూడా అంతే ఫిదా అవుతున్నారు. ఇక రామ్ చరణ్ నెక్స్ట్ RC15 కోలీవుడ్ తో డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లో అక్టోబర్ 8 న పూజ కార్యక్రమాలతో మొదలై ఈమధ్యనే రెగ్యులర్ షూట్ కి వెళ్ళింది. ఇప్పటికే శంకర్ RC15 మొదటి షెడ్యూల్ లో ఓ సాంగ్ అండ్ ఓ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. ప్రస్తుతం రామ్ చరణ్ హైదరాబాద్ లో ఉన్నారు. పూణే లో RC15 ఫస్ట్ షెడ్యూల్ తర్వాత సెకండ్ షెడ్యూల్ ని కూడా దర్శకుడు శంకర్ ప్లాన్ చేసారు. RC15 సెకండ్ షెడ్యూల్ నవంబర్ 5 న మొదలు కాబోతుంది అని తెలుస్తుంది.

Advertisement
CJ Advs

హైదరాబాద్ లోని ఓ ప్రత్యేకమైన లొకేషన్ లో రామ్ చరణ్ అలాగే సినిమాలోని కీలక పాత్రల మధ్యన సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరగనుందని తెలుస్తుంది. ఇక దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఓ యాక్షన్ సీక్వెన్స్ కి  కేవలం 7 నిమిషాల కోసం 70 కోట్లు శంకర్ ఖర్చు పెట్టిస్తున్నారనే టాక్ ఉంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్రలు కీ రోల్స్ లో కనిపించబోతున్నారు. ఇక రామ్ చరణ్ ని ఢీ కొట్టబోయే విలన్ గా మలయాళ నటుడు సురేష్ గోపి నటించబోతున్నారని అంటున్నారు.

RC15 second schedule update :

Ram Charan RC15 second schedule update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs