Advertisement
Google Ads BL

చిరు సినిమాలో సల్మాన్ ఖాన్ ఫిక్స్


మెగాస్టార్ చిరు - బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బెస్ట్ ఫ్రెండ్స్. అయితే గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరు సినిమాలో సల్మాన్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. చిరు - మోహన్ రాజా కాంబోలో మొదలైన లూసిఫర్ రీమేక్.. గాడ్ ఫాదర్ మూవీలో సల్మాన్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ చేయబోతున్నాడని అంటున్నారు. అయితే జస్ట్ రూమర్ కిందే సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ పాత్ర అనే అనుకున్నారు. కానీ తాజాగా గాడ్ ఫాదర్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గాడ్ ఫాదర్ మూవీలో సల్మాన్ ఖాన్ నటించబోతున్నాడని విషయాన్నీ ఓ ఇంటర్వ్యూలో చెప్పకనే చెప్పేసాడు.

Advertisement
CJ Advs

అయితే చిరు కి రైట్ హ్యాండ్ పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపించబోతున్నాడని తెలుస్తుంది. లూసిఫర్ సినిమాలో మోహన్ లాల్ కి రైట్ హ్యాండ్ గా ఆ సినిమా ని డైరెక్ట్ చేసిన టాప్ హీరో పృద్వి రాజ్ నటించాడు. ఆ రోల్ సినిమాకి చాలా ఇంపార్టెంట్... ఇప్పుడు తెలుగు గాడ్ ఫాదర్ లో అదే పృద్వి రాజ్ రోల్ ని సల్మాన్ ఖాన్ పోషిస్తాడని అంటున్నారు. నిజంగా సల్మాన్ ఖాన్ - చిరు కాంబో సెట్ అయితే.. బాక్సాఫీసు దద్దరిల్లుపోతుంది ఇది పక్కా అంటున్నారు మెగా ఫాన్స్. ఇక గాడ్ ఫాదర్ లో విలన్ గా సత్య దేవ్ నటిస్తుండగా.. యాంకర్ అనసూయ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే గాడ్ ఫాదర్ ఫస్ట్ అండ్ సెకండ్ షడ్యూల్ ని హైదరాబాద్, ఊటీలలో పూర్తి చేసుకున్న చిరు - మోహన్ రాజా లు మూడో షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు.

Salman Khan Special Cameo Confirmed In Chiranjeevi Godfather:

S.S Thaman Confirms Salman Khan, Chiranjeevi Dance Number in Godfather
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs