Advertisement
Google Ads BL

ఈ హీరోయిన్ కష్టాలు తీరినట్లే..


గత ఏడాది బాలీవుడ్ లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ ఆత్మహత్య కాస్తా సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మెడకు చుట్టుకుంది. సుశాంత్ మరణంతో డ్రగ్స్ కేసు బయటికి రావడం, ఆ కేసులో రియా చక్రవర్తి అరెస్ట్ అయ్యి కొన్ని నెలలపాటు జైలు శిక్ష కూడా అనుభవించింది. అంతేకాకుండా బెయిల్ పై బయటికి వచ్చిన రియా చక్రవర్తి బ్యాంకు ఖాతాలను, సెల్ ఫోన్, ల్యాప్ టాప్ లని ఎన్సీబీ అధికారులు సీజ్ చేసారు.. అలాగే రియా చక్రవర్తి ముంబై వదిలి పెట్టి ఎక్కడికి వెళ్లరాదని కండిషన్ మీద ఆమెకి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే రియా చక్రవర్తి బెయిల్ పై బయటికి వచ్చాక.. మళ్ళీ నెమ్మదిగా కెరీర్ వైపు అడుగులు వేసింది.. ప్రస్తుతం కెరీర్ లో బిజీ అయ్యింది.

Advertisement
CJ Advs

ఇక తాజాగా రియా చక్రవర్తికి డ్రగ్స్ కేసులో ఊరటాలభించింది. అంటే కేసు పూర్తిగా కొట్టివెయ్యకపోయినా.. రియా చక్రవర్తి బ్యాంక్‌ ఖాతాలను తిరిగి ఉపయోగించుకోవడానికి, ఆమె ల్యాప్ టాప్ అలాగే సెల్ ఫోన్ ని ఆమెకి అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది. సుమారు 14 నెలల నుంచి సీజ్‌లో ఉన్న రియా చక్రవర్తి బ్యాంకు ఖాతాలను తెర్చుకోవడానికి బ్యాంకు అనుమతి ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం రియా చక్రవర్తి లాయర్ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పోషణ నిమిత్తం రియా ఖాతాలను వెంటనే విడుదల చేయాలని స్పెషల్‌ కోర్టును అభ్యర్థించారు. రియా లాయర్ వేసిన పిటిషన్ ని పరిశీలించిన కోర్టు.. వాదోపవాదాలు విన్న తర్వాత.. రియా బ్యాంక్‌ ఖాతాలను తిరిగి అప్పగించాలని ఆదేశించింది. 

Rhea Chakraborty Bank account unfreeze:

After a Year Rhea Chakraborty Bank Account to be Defreezed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs