Advertisement
Google Ads BL

కంగనాకు అంతగా నచ్చిన వ్యక్తి ఎవరో..


వివాస్పద హీరోయిన్ కంగనా రనౌత్ ఏది మాట్లాడినా.. ఒప్పే అనే రేంజ్ లో ఉంటుంది ఆమె బిహేవియర్.. బీజేపీ కి వత్తాసు పలికే కంగనా రనౌత్ మిగతా పార్టీలను, ముఖ్యంగా శివసేన పార్టీని వారిని కించపరుస్తూ మాట్లాడడమే కాదు.. బాలీవుడ్ స్టార్స్ ని, బడా నిర్మాతలని, దర్శకులని ఏకి పారేస్తోంది. ఎప్పుడూ కాంట్రవర్సీలకు దగ్గరగా ఉండే కంగనా రనౌత్ తాజాగా పెళ్లి కబుర్లు చెబుతుంది. వచ్చే ఐదేళ్ళలో మీ కెరీర్, మీ పర్సనల్ లైఫ్ లో ప్రణాళికలు ఏమిటి అని అడిగిన ప్రశ్నకు కంగనా స్పందిస్తూ.. ఐదేళ్ల‌లో ఓ త‌ల్లిగా త‌న‌ను తాను చూసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు గా చెప్పి షాకిచ్చింది. అంతేకాదు త్వ‌ర‌లోనే వివాహం చేసుకోవాల‌ని, పిల్ల‌ల‌ను కనాల‌ని ఉందని కూడా చెప్పుకొచ్చింది.  

Advertisement
CJ Advs

తన లైఫ్ లో ఓ స్పెషల్ పర్సన్ ఉన్నారని.. ఆ పర్సన్ గురించి త్వరలోనే అందరికి తెలియజేస్తాను అంటూ అందరిని సస్పెన్స్ లోకి నెట్టింది. మరి కంగనా రనౌత్ మనసులో అంత ప్రత్యేకమైన స్థానం సంపాదించిన ఆ వ్యక్తి ఎవరబ్బా అంటూ ఇప్పుడు మీడియా తో సహా.. బాలీవుడ్ ప్రేక్షకులు వెతుకుతున్న ప్రశ్న. ఎందుకంటే కంగనాకు అంత బాగా నచ్చి, మనసుకు దగ్గరగా వచ్చిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోలనే ఆత్రుత ఆమె ఫాన్స్ కే కాదు.. ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులకి, అలాగే సెలబ్రిటీస్ కి మొదలైపోయింది. 

Kangana Ranaut opens up about her marriage life:

Kangana Ranaut hints at having a special someone in her life 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs