ఓ పక్క పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ డేట్స్ దగ్గర పడే కొద్దీ.. సినిమాల ప్రమోషన్స్ ఓ రేంజ్ లో మొదలైపోయాయి. డిసెంబర్ 17 న రిలీజ్ కాబోతున్న పుష్ప పాన్ ఇండియా హడావిడి సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంది. సుకుమార్ కీలక పాత్రల లుక్స్ రివీల్ చేస్తూ మధ్య మధ్యలో సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. మరోపక్క జనవరి 7 న రిలీజ్ కాబోతున్న ఆర్.ఆర్.ఆర్ హడావిడి మాములుగా లేదు. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ని పక్కా ప్లానింగ్ లో రాజమౌళి మొదలు పెట్టారు. రీసెంట్ గా ఆర్.ఆర్.ఆర్ నుండి నాటు నాటు సాంగ్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు.
ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ లుక్స్, మాస్ స్టెప్స్ అదిరిపోగా.. ఆర్.ఆర్.ఆర్ నుండి ఇకపై ప్రేక్షకులు అంచనాలు అందుకునేలా ప్రమోషన్స్ చెయ్యబోతున్నారు కూడా. మరి ఇలా పాన్ ఇండియా సినిమాల హడావిడి, ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఉంటే.. ప్రభాస్ రాధేశ్యామ్ మేకర్స్ మాత్రం గమ్మునుండిపోతున్నారు. సంక్రాంతి బరిలో ఉన్న పవన్ భీమ్లా నాయక్ సైతం ప్రమోషన్స్ లో దూసుకుపోతుంటే.. రాధేశ్యామ్ మాత్రం టీం ఇలా సైలెంట్ గా ఉంటే.. ప్రభాస్ ఫాన్స్ కి పిచ్చి లెగుస్తుంది. ప్రభాస్ పుట్టిన రోజుకి విక్రమాదిత్య టీజర్ తో సరిపెట్టిన.. రాధేశ్యామ్ టీం పూజ ప్రేరణ టీజర్ ఇచ్చేస్తుంది అంటూ ప్రచారం జరిగినా.. మళ్ళీ ఇంతవరకు అప్ డేట్ లేదు.. సో పుష్ప, ఆర్.ఆర్.ఆర్ తో పోలిస్తే రాధేశ్యామ్ ప్రమోషన్స్ బాగా వీక్ గా ఉన్నాయి.