ఈ మధ్యన సమంత తరచూ వార్తల్లో ఉంటుంది.. నాగ చైతన్య డివోర్స్ తీసుకున్నాక సమంత సోషల్ మీడియాలో ఫాన్స్ తోనూ, నెటిజెన్స్ తో సమస్యలు ఎదుర్కొని.. కోర్టుకి కూడా వెళ్ళింది. ఓ పక్క నాగ చైతన్య తో విడిపోవడం, మరోపక్క నెటిజెన్స్ ట్రోలింగ్ తో మానసికంగా నలిగిపోయిన సమంత మళ్ళీ ఇప్పుడిప్పుడే నార్మల్ గా మారుతుంది. ఎప్పటిలాగే కెరీర్ లో బిజీ అవుతూ.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా మారుతూ, పార్టీలకి వాటికి అటెండ్ అవుతుంది. అయితే తాజాగా సమంత ఎన్టీఆర్ - రామ్ చరణ్ లను ఉద్దేశించి మెంటలెక్కించేసారు అంటూ ట్వీట్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది.
వాళ్లిద్దరూ సమంతకి ఎందుకు మెంటల్ తెప్పించారంటే.. ఈ రోజు బుధవారం ఆర్.ఆర్.ఆర్ నుండి రాజమౌళి ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబో లో నాటు నాటు అనే సాంగ్ ని వదిలారు. ఆ సాంగ్ లో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ లు ఇద్దరూ ఊర మాస్ స్టెప్స్ కి కేవలం ఫాన్స్ మాత్రమే కాదు.. సెలెబ్రిటీలకి పిచ్చెక్కిపోయింది. లిరికల్ ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ అదరగొట్టెయ్యడంతో.. ఈ సాంగ్ థియేటర్స్ లో విజువల్ గా చూస్తే ఇంకెంత బావుంటుంది అని ఫాన్స్ అనుకుంటుంటే.. ఈ సాంగ్ చూసిన సమంత మెంటల్ అంటూ పిచ్చెక్కిపోతోందనే అర్థంలో సమంత ట్వీట్ చెయ్యడం అందరిని ఆకర్షించింది.