Advertisement
Google Ads BL

హీరో ఆనంద్ దేవరకొండ ఇంటర్వ్యూ


దొరసాని, మిడిల్ క్లాస్ మెలొడీస్ చిత్రాలతో టాలెంటెడ్ హీరోగా అటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ. ఆయన కొత్త సినిమా పుష్పక విమానం మొదటినుంచీ అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. గీత్ సైని, శాన్వీ మేఘన నాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని దామోదర దర్శకత్వంలో కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలుగా  వ్యవహరించారు. నవంబర్ 12న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతోంది పుష్పక విమానం. ఈ సందర్భంగా సినిమా విశేషాలను ఆనంద్ దేవరకొండ సినీజోష్ తో పంచుకున్నారు. ఆ విశేషాలు చూస్తే..

Advertisement
CJ Advs

- దర్శకుడు దామోదర మా అన్నయ్య విజయ్ కు స్నేహితుడు. ఆయన చెప్పిన పుష్పక విమానం కథ బాగా మా అందరికీ నచ్చింది. వేరే హీరోలను ఈ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నించాం. కుదరలేదు. పెళ్లాం లేచిపోయిన వ్యక్తి హీరో అవడం వాళ్లు సందేహించేలా చేసింది. మొదట్లో నాకు కూడా ఈ క్యారెక్టర్ చేయగలనా లేదా అనే డౌట్ వచ్చింది. టెస్ట్ షూట్ చేసిన తర్వాత నమ్మకం కుదిరి ఒప్పుకున్నాను.

- పెళ్లి మీద చాలా ఆశలు పెట్టుకుంటాడు టీచర్ గా పనిచేసే చిట్టిలంక సుందర్ అనే వ్యక్తి. కానీ పెళ్లయ్యాక అతని ఆశలన్నీ తలకిందులు అవుతాయి. భార్య లేచిపోతుంది. కానీ ఆ విషయం మీద పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వలేక తనే వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో హీరోకు కోపం, ఫ్రస్టేషన్ వస్తుంటాయి. చూసే వాళ్లకు కూడా హీరో మీద జాలి కలుగుతుంది.

- పుష్పక విమానం ట్రైలర్ లో ఫన్  చూశారు. కానీ సినిమాలో ఫన్ ఫ్లస్ ఎమోషన్ రెండూ ఉంటాయి. నా క్యారెక్టర్ చాలా పద్దతిగా, సైలెంట్ గా ఉంటే హీరోయిన్ శాన్వి క్యారెక్టర్ చాలా బబ్లీగా, హుషారుగా ఉంటుంది. సునీల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆయనది ప్రతి ఒక్కరినీ అనుమానిస్తూ, తన గురించి మాత్రమే ఆలోచించుకునే స్వభావం. ఈ క్యారెక్టర్ లో సునీల్ అన్న సూపర్బ్ గా నటించారు. నవ్విస్తారు, భయపెడతారు. 

- పెళ్లి అనేది మన సమాజానికి దొరికిన ఒక సంప్రదాయం. పెళ్లి వల్ల మన లైఫ్ కు ఒక బాండింగ్, ఒక పర్పస్, ఒక సర్కిల్ ఏర్పడతాయి. పెళ్లి అనే విషయానికి నేను పూర్తి అనుకూలం. పుష్పక విమానం సినిమాలో పెళ్లి గురించి ఓ మంచి విషయాన్ని చెప్పబోతున్నాం.

- దర్శకుడు దామోదర పుష్పక విమానం చిత్రాన్ని చాలా క్లారిటీగా, ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించాడు. నేను సినిమా పూర్తయ్యాక కొన్ని పనుల్లో ఇన్వాల్వ్ అయ్యా గానీ, సినిమా మేకింగ్ టైమ్ లో ఎక్కడా జోక్యం చేసుకోలేదు. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. అన్నయ్య విజయ్ కు పుష్పక విమానం సినిమా బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను బాగా ప్రమోట్ చేద్దామని ముందుకొచ్చాడు. తన సినిమాల పనుల్లో బిజీగా ఉన్నా, పుష్పక విమానం ప్రమోషన్ కు వీలైనంత టైమ్ ఇచ్చాడు.

- రెగ్యులర్ హీరోగా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. దొరసాని సినిమా టైమ్ లో ఇలా ఉండాలని తెలీదు. అంతా కొత్తవాళ్లం ఓ మంచి ప్రయత్నం చేశాం. అందులో కమర్షియల్ గా వెళ్లినా, లేక పూర్తిగా నేచురల్ గా వెళ్లినా ఫలితం మరోలా ఉండేది. కానీ మేము మధ్య దారిలో సినిమా చేయడం వల్ల దొరసాని అనుకున్నంత విజయం సాధించలేదు అనిపిస్తుంటుంది. మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమా టైమ్ కు ఆ కథ ఎంత వర్కవుట్ అవుతుంది అనేది మాకు అంచనా లేదు. అంతా బొంబాయి చట్నీ కథ అనేవారు. కానీ ఆ కథలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయని మాకు నమ్మకం. అది వర్కవుట్ అయ్యింది.

- పాండమిక్ వల్ల పుష్పక విమానం సినిమా విడుదల ఆలస్యమైంది. మిడిల్ క్లాస్ మెలొడీస్ కూడా పాండమిక్ వల్ల డైరెక్ట్ ఓటీటీ కి వెళ్లింది. ఈ సినిమాకు అదే జరుగుతుందా అని భయపడ్డాం. కానీ థియేటర్ లోనే రిలీజ్ చేయాలని గట్టిగా అనుకున్నాం. కొంత ఆలస్యమైన పుష్పక విమానం సినిమా భారీగా థియేటర్లలో రిలీజ్ అవుతుండటం సంతోషంగా ఉంది.

- మా సినిమా ప్రమోషన్ కు వచ్చిన అల్లు అర్జున్ అన్నకు థాంక్స్. ఆయన చాలా సపోర్ట్ చేసి టైమ్ ఇచ్చారు. ట్రైలర్ బాగుందని బన్నీ అన్న చెప్పడం వల్ల మా సినిమాకు మంచి బూస్టప్ వచ్చింది. ఆయన ఫ్యాన్స్ కూడా మాకు బాగా సపోర్ట్ గా ఉంటున్నారు.

- నా కథల ఎంపికలో అన్నయ్య ప్రమేయం ఉండదు. నేనే సెలెక్ట్ చేసుకుంటా. అన్నయ్య సినిమాల స్పాన్ చాలా పెద్దది. ఆయన లైగర్ సినిమా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ టాలీవుడ్ అనుకోవచ్చు.

- నెక్ట్ కేవీ గుహన్ గారు, సాయి రాజేశ్ వంటి దర్శకులతో సినిమాలు చేయబోతున్నాను. వీటిలోనూ నా క్యారెక్టర్స్ సహజంగా మన చుట్టూ ఉండే అబ్బాయిలా ఉంటాయి. హీరో కొడతే పదిమంది ఎగరిపడాలనే ఇప్పటి ప్రేక్షకులకు అంతగా నచ్చడం లేదు.

- పుష్పక విమానం లాంటి కొత్త తరహా కథల్లో నటించేందుకు నటీనటులు సిద్ధం అవుతున్నారు. అటు ఆఢియెన్స్ కూడా ఇలాంటి కొత్త కథలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి నా లాంటి ఆర్టిస్టులకు ఇన్నోవేటివ్ సబ్జెక్ట్స్ చేసేందుకు స్కోప్ దొరుకుతోంది.

Anand Deverakonda Interview :

Anand Deverakonda Interview about Pushpaka Vimanam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs