Advertisement
Google Ads BL

నాగ శౌర్య తండ్రి అరెస్ట్.. కాసేపటికే..


నాగ శౌర్య వరుడు కావలెను మూవీ హిట్ తో జోష్ లో ఉన్నాడు అనుకుంటే.. తన ఫామ్ హౌస్ లో జరిగిన పేకాట కేసులో సైలెంట్ గా ఉండిపోయాడు. నాగ శౌర్య లీజ్ కి తీసుకున్న ఓ ఫామ్ హౌస్ ని మరో వ్యక్తి అద్దెకి తీసుకుని అందులో పేకాట నిర్వహించడంతో.. ఆ వ్యక్తిని పోలీస్ లు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. గుత్తా సుమన్ అనే వ్యక్తి నాగ శౌర్య ఫార్మ్ హౌస్ ని అద్దెకి తీసుకుని ఆ ఫామ్ హౌస్ లో పేకాట నిర్వహించడంతో.. అక్కడ చాలామంది ప్రముఖులు పోలీస్ రైడ్ లో పట్టుబడ్డారు. ఈ కేసులో నాగ శౌర్య తండ్రిని పోలీస్ లు స్టేషన్ కి పిలిచి.. ఫామ్ హౌస్ లీజు పాత్రలను పరిశీలించి విచారణ చేపట్టారు. అయితే ఈకేసులో ఈ రోజు అంటే బుధవారం నాగ శౌర్య తండ్రి ప్రసాద్ ని పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
CJ Advs

మంచి రేవుల ఫామ్ హౌస్ పేకాట కేసులో.. క్యాసినో కింగ్‌పిన్‌ గుత్తా సుమన్‌తో కలిసి కొన్ని రోజులుగా నాగ శౌర్య తండ్రి శివలింగ ప్రసాద్‌ పేకాట దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించడంతో నాగ శౌర్య తండ్రి అరెస్టు అనివార్యమైంది. నిన్నమొన్నటి వరకు నాగ శౌర్య తండ్రి పేరు ఈ కేసులో కాస్త తక్కువగానే వినిపించింది. ఈ కేసులో శివలింగ ప్రసాద్ బెయిల్ పిటిషన్ దాఖలు చెయ్యగా.. ఆయనకి కోర్టు బెయిల్ మంజూరు చెయ్యడంతో.. నాగ శౌర్య తండ్రి విడుదలయ్యారు.

Naga Shaurya father arrested in a gambling case:

Naga Shaurya Father Arrested, Released on Bail
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs