Advertisement
Google Ads BL

RC15: ఒక్క యాక్షన్ సీన్ కి అన్ని కోట్లా..


కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ అంటేనే భారీ తనం. ఆయన సినిమాలో సెట్స్ కే కోట్లు కుమ్మరించాలి. లేదంటే శంకర్ అస్సలు శాటిస్ఫై అవ్వరు. తాజాగా రామ్ చరణ్ తో శంకర్ RC15 చేస్తున్నారు.. అది కూడా లెక్కలు తూకాలు వేసే దిల్ రాజు బ్యానర్ లో. ప్రొడక్షన్ లో లెక్కలు పర్ఫెక్ట్ గా ఉండాలనే దిల్ రాజుకి.. డబ్బు ని నీళ్లలా ఖర్చు పెట్టే శంకర్ కి ఎక్కడ సెట్ అయ్యిందో ఎవరికీ ఓ పట్టాన అర్ధం కావడం లేదు. శంకర్ చరణ్ కోసం తగ్గారా.. లేదా దిల్ రాజే.. శంకర్ కోసం మనసు మార్చుకున్నారా అనేది ఇప్పడు అంతు చిక్కని ప్రశ్నే. ఇకపోతే ఈమధ్యనే పూణేలో లో RC15 మొదటి షెడ్యూల్ మొదలైంది.. అందులో ఓ యాక్షన్ సీన్ తో పాటుగా.. ఓ సాంగ్ కూడా చిత్రీకరించారు. 12 రోజుల పాటు ఒక్క సాంగ్ కే టైం కేటాయించిన శంకర్ ఈ సాంగ్ కి కూడా భారీగానే ఖర్చు పెట్టించారట.

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు తాజాగా RC15 లో ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా 70 కోట్లా ఖర్చు చేయబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది కూడా 7 నిమిషాల పాటు సాగే ఈ ఒక్క ఫైట్ కోసం.. దాదాపు 70 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. ఇంతవరకు ఏ సినిమాలో చూడని రేంజ్‌లో ఈ 70 కోట్ల ఫైట్ సీన్ ఉంటుందని తెలుస్తుంది. ఈ ఫైట్ సీన్ సినిమాలో మెయిన్ హైలెట్ గా ఉండబోతుంది.. ఈ యాక్షన్ సీన్ కోసం ఓ సెట్ కూడా సిద్దమవుతుందట.. RC15 సెకండ్ షెడ్యూల్ లోనే రామ్ చరణ్ ఇంకా విలన్ పై ఈ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తారని.. విలన్ గా మలయాళ క్రేజీ అంటాడు సురేష్ గోపిని అనుకుంటున్నారట. 

Ram Charan - Shankar to have Rs 70 crore budget for 7-minute action sequence?:

Shankar planning most expensive action sequence in RC15
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs