Advertisement
Google Ads BL

హైపర్ ఆదిపై దాడి.. ఎంతవరకు నిజం


కమెడియన్ గా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న హైపర్ ఆది జబర్దస్త్ లో చేసే స్కిట్స్ వలన అప్పుడప్పుడు కాంట్రవర్సీలలో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు క్షమాపణలు కూడా చెప్పిన హైపర్ ఆది ఇప్పుడు మరోసారి వివాదంలో ఇరుక్కోవడమే కాదు.. బయటికి కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నాడంటూ ప్రచారం జరుగుతుంది. ఈటీవీలో దీపావళి రోజున చేసిన ఓ స్పెషల్ ప్రోగ్రాంలో హైపర్ ఆది.. ప్రస్తుత మా అధ్యక్షుడు మంచు విష్ణు ని ఇమిటేట్ చేస్తూ స్కిట్స్ చేసాడు. ఆ స్కిట్స్ వెనుక మెగా ఫ్యామిలీ నాగబాబు ఉన్నారని.. కావాలనే హైపర్ ఆది చేత మంచు విష్ణు ని కించపరిచేలా స్కిట్స్ చేయించారు అంటూ మంచు విష్ణు అభిమానులు హైపర్ ఆది పై ఆగ్రహం వ్యక్తం చెయ్యడమే కాదు.. అతన్ని కొట్టేందుకు వెతుకుతున్నట్లుగా వార్తలొచ్చాయి.

Advertisement
CJ Advs

దానితో హైపర్ ఆది అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని అన్నారు. అజ్ఞాతం కాదు అసలు హైపర్ ఆది ని వెతుకుతూ విష్ణు ఫాన్స్ అతను షూటింగ్ చేసే దగ్గరకి వెళ్లారని.. అక్కడే షూటింగ్ లో ఉన్న హైపర్ ఆదిని విష్ణు ఫాన్స్ కొట్టారని కూడా ప్రచారం జరుగుతుంది. మరి నిజంగానే ఆది పై విష్ణు ఫాన్స్ చేయిచేసుకున్నారా.. లేదా ఇదంతా రూమరా అనేది హైపర్ ఆది బయటికి వచ్చి క్లారిటీ ఇస్తేనే కానీ.. ఈ విషయం తెగేలా కనిపించడం లేదు. మరి హైపర్ ఆది ఎక్కడా అంటూ నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

Was really Manchu Vishnu gang attack Hyper Aadi?:

Was really Tollywood actor Manchu Vishnu gang attack Jabardasth Comedian Hyper Aadi?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs