Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ కి లీగల్ నోటీసులు


అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ తోనూ, అలాగే ఆహా కి ప్రమోషనల్ ఈవెంట్స్ తోనూ, ఫ్యామిలీ తో దివాళి వేడుకల్లోనూ, అలాగే ఆయన నటిస్తున్న కొన్ని బ్రాండ్ అంబాసిడర్లు యాడ్స్ షూట్ లోను ఫుల్ బిజీగా వుంటున్నారు. ఈమధ్యనే శ్రీ చైతన్య విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా.. ఆ విద్యాసంస్థలను ప్రమోట్ చేస్తున్న అల్లు అర్జున్.. రీసెంట్ గా రాపిడో యాడ్లో నటించారు. ఆ యాడ్ లో అల్లు అర్జున్ ఆర్టీసీ బస్సులో ఎక్కితే సాధారణ దోశల మాదిరి గానే ఎక్కువ సమయం తీసుకుంటాయి అని కానీ రాపిడో చాలా వేగంగా సురక్షితంగా ఉంటుందని అదే సమయంలో మసాలా దోశ సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ ఆ యాడ్ లో చెప్పిన డైలాగ్స్ ఇప్పుడు అల్లు అర్జున్ ని చిక్కుల్లో పడేసింది.

Advertisement
CJ Advs

అదేమిటంటే.. టీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఆ ర్యాపిడో యాడ్ లో అల్లు అర్జున్ ఆర్టీసీ బస్సులను కించపరిచే విధంగా మాట్లాడారు అని.. ఆ యాడ్ వలన ఆర్టీసీ ప్రయాణికులు, అభిమానులు, ఆర్టీసీ ఉద్యోగులు ఇలా అనేకమంది నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారని, ర్యాపిడో సర్వీస్ ని ప్రమోట్ చెయ్యడానికి ఆర్టీసీ బస్సులని కించపరచడం ఏమిటి అని.. అసలు ఆర్టీసీ అంటేనే సామాన్యులకు సేవ చేసే సంస్థ గా ఉందని అలాంటి మంచి సంస్థ కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదు .. అందుకే ఆ యాడ్ లో నటించిన అల్లు అర్జున్ సహా.. ర్యాపిడో కంపెనీకి లీగల్ నోటీసు లు ఇస్తున్నట్టుగా సజ్జనార్ తెలిపారు. మెరుగైన సమాజం కోసం, ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా స్టార్స్ ఉండాలి కానీ.. అలంటి యాడ్స్ లో నటించాలి అని అన్నారాయన. 

Telangana RTC to send legal notice to Allu Arjun:

TSRTC to send legal notice to Allu Arjun
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs