Advertisement
Google Ads BL

కత్రినా కోసం అద్దె ఇల్లు


బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ లు ఈ ఏడాది పెళ్లి పీటలెక్కబోతున్నారు. డిసెంబర్ లో విక్కీ కౌశల్ - కత్రినా జంట ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటివరకు వీరి పెళ్లి విషయమై ఎలాంటి అఫీషియల్ ప్రకటన లేదు కానీ.. కత్రినా కైఫ్ రోక వేడుక ముంబైలో అంగరంగ వైభవంగా జరిగిపోయింది. మరోపక్క పెళ్లి ఏర్పాట్లు ఘనంగా మొదలైపోయినట్లుగా ఓ ఇంగ్లీష్ డైలీ వరసబెట్టి వార్తలు ప్రచురిస్తుంది. ఇక కత్రినా - విక్కీ కౌశల్ లు రాజస్థాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌లో వీరి వివాహం జరగనుందంటూ ఓ న్యూస్ బిటౌన్ లో చక్కర్లు కొడుతోంది. ఇక కత్రినా కానీ, విక్కీ కౌశల్ లు కానీ తమ పెళ్లి విషయాన్ని పబ్లిక్ గా బయటపెట్టకపోయినా.. వారి పెళ్లి విషయం మాత్రం కథలు కథలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
CJ Advs

ఇక కత్రినాని పెళ్లి చేసుకున్న తర్వాత విక్కీ కౌశల్ తన భార్య తో కలిసి ఉండేందుకు గాను ముంబై లోని ఓ పోర్ష్ ఏరియాలో ఇల్లు అద్దెకి తీసుకున్నాడని  తెలుస్తుంది. తన భార్యకి బహుమతిగా ఈ ఇల్లు అద్దెకి తీసుకున్నాడని, చాలా విశాలవంతమైన ఇల్లు అని, అది కూడా కాస్ట్లీ ఫ్లాట్ అని అంటున్నారు. ముంబై జుహు ప్రాంతంలోని రాజ్‌మహల్‌లో విక్కీ కౌశల్ ఆ ఇంటిని అద్దెకి తీసుకుని నెలకి అద్దెగా 8 లక్షలు చెల్లించనున్నాడట. ఇప్పటికే ఆ ఇంటి కోసం కోటిన్నర అడ్వాన్స్ కూడా విక్కీ కౌశల్ చెల్లించాడని, ఓ ఐదేళ్ల పాటు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారని.. ప్రస్తుతం బి టౌన్ లో విక్కీ అద్దెకి తీసుకున్న ఇంటి ముచ్చట్లే వినిపిస్తున్నాయి.

Are Katrina Kaif and Vicky Kaushal moving into new house:

Vicky Kaushal Has A Finalized A House To Settle In Post Wedding
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs