Advertisement
Google Ads BL

కాజల్ ఇంత కన్ఫ్యూజ్ చేసిందేమిటి


కాజల్ అగర్వాల్ సీనియర్స్ లిస్ట్ లోకి వెళ్లినా.. చేతినిండా సినిమాలతో.. ఇంకా సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో ఫుల్ బిజినే. తాజాగా ఆచార్య ని కంప్లీట్ చేసిన కాజల్ అగర్వాల్ నాగార్జున ద ఘోస్ట్ లో హీరోయిన్ గా చేస్తుంది. ఇక భర్త తో కలిసి ఫస్ట్ యానివర్సరిని సెలెబ్రేట్ చేసుకున్న కాజల్ అగర్వాల్ రీసెంట్ గా దివాళి ని గ్రాండ్ గానే సెలెబ్రేట్ చేసుకుంది. అయితే గత కొన్ని రోజులుగా కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్.. అందుకే నాగ్ ఘోస్ట్ సినిమా నుండి తప్పుకుంది.. అంటూ ప్రచారం జరిగిన కాజల్ మాత్రం స్పందించలేదు. కానీ తాజాగా కాజల్ అగర్వాల్ ప్రెగెన్సీ రూమర్స్ పై స్పందించింది. ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ విషయం మాట్లాడాలి అని అనుకోవడం లేదని, కానీ సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని అందరిని కన్ఫ్యూజ్ చేసింది.

Advertisement
CJ Advs

కానీ తల్లి అవడం అనేది ప్రతి ఒక్కరికి ఎంతో గొప్ప వరం అని.. తాను కూడా ఆ మాతృత్వాన్ని అనుభవించాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఓ విధంగా తాను పెళ్ళికి ముందే తల్లిని అయ్యాను అని.. అది తన చెల్లి నిషా అగర్వాల్ బాబు తో.. తల్లిగా బాధ్యతలు తీసుకోవడమే కాదు.. వాళ్ళకు ఆ సమయంలో చాలా దగ్గరయ్యాయని చెప్పింది. ఇక తల్లి అవడం కాస్త భయంగా ఉంది అని, తన చెల్లి తల్లి అవుతున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ ఫేస్ చేసిందో దగ్గరుండి చూసాను అని, తన చెల్లి పిల్లలను చూస్తే గొప్ప అనుభూతి కలుగుతుంది. అంతేకాదు.. తనకి పిల్లలు పుడితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అనే ఆలోచనే తనని ఎమోషనల్ గా మార్చేసింది అని చెప్పిన కాజల్... ప్రెగ్నెన్సీ విషయాన్నీ మాత్రం బయటపెట్టలేదు. 

Kajal Agarwal on pregnancy rumors:

<span>Kajal carry on&nbsp;</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs