Advertisement
Google Ads BL

అర్జున ఫల్గుణ టీజర్


శ్రీ విష్ణు, జోహార్ ఫేమ్ తేజ మర్ని కాంబినేషన్‌లో అర్జున ఫల్గుణ అనే సినిమా తెరకెక్కినది. విభిన్న కథలను ఎంచుకుంటున్న శ్రీ విష్ణు ఏ మధ్యనే రాజా రాజా చోర మూవీ తో హిట్ కొట్టాడు. ఇప్పుడు అర్జున ఫల్గుణ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. అర్జున ఫల్గుణ టీజర్‌ను ఈరోజు  విడుదల చేశారు.

Advertisement
CJ Advs

మనం జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు వెళ్లాల్సిందే. కొన్ని ఘటనలు మాత్రం మన జీవితాల్ని తలకిందులు చేస్తాయి. ఇదే విషయాన్ని టీజర్‌లో చూపించారు. నాది కాని కురుక్షేత్రంలో.. నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా నేను బలైపోవడానికి అభిమన్యుడిని కాదు.. అర్జునుడిని అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్‌తో సినిమా నేపథ్యం ఏంటో అర్థమవుతోంది. 65  సెకన్ల టీజర్‌లో ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లను చూపించారు.

డైలాగ్స్, విజువల్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. జగదీష్ చక్రవర్తి సినిమాటోగ్రఫీ అందరినీ కట్టిపడేసేలా ఉంది. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యింది.

ఎన్ ఎమ్ పాషా సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. పి. సుధీర్ వర్మ మాటలు అందించారు. అర్జున ఫల్గుణ త్వరలోనే థియేటర్‌లోకి రానుంది.

Arjuna Phalguna teaser released:

Sree Vishnu Arjuna Phalguna teaser released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs