Advertisement
Google Ads BL

ఆర్.ఆర్.ఆర్: నాటు.. నాటు ప్రోమో..


రాజమౌళి - రామారావు - రామ్ చరణ్ కలయికలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపై ఎంత క్రేజ్ ఉందో కొలతల్లో కొలవడం, మాటల్లో చెప్పడం చాలా కష్టం. రాజమౌళి పాన్ ఇండియా బ్రాండ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ క్రేజ్, ఆర్.ఆర్.ఆర్ హీరోల టీజర్స్, గ్లిమ్ప్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచేస్తుంటే.. దోస్తీ సాంగ్ సినిమాపై మరింతగా హైప్ క్రియేట్ చేసింది. అంతేకాదు.. రేపు రాబోతున్న నాటు.. నాటు సాంగ్ కోసం రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ ఫాన్స్ ఎంతెలా వెయిట్ చేస్తున్నారంటే.. సోషల్ మీడియాలో ఆర్.ఆర్.ఆర్ హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తూ భీభత్సమైన హడావిడి చేసేంత. తాజాగా నాటు నాటు ప్రోమో వదిలారు మేకర్స్. అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నాటు స్టెప్స్ విజువల్స్ చూస్తే ఈ సాంగ్ పై మరింతగా అంచనాలు పెరిగిపోతున్నాయి.

Advertisement
CJ Advs

రేపు నవంబర్ 11 సాయంత్రం 4 గంటలకి ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ ని రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా ఈ ప్రోమోతోనే అనౌన్స్ చేసారు. చంద్ర బోస్ రాసిన ఈ సాంగ్ ని కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ లు ఆలపించారు. నా పాట సూడు.. నా పాట సూడు అంటూ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ లు నాటు స్టెప్స్ ఇరగదీసినట్లే కనిపిస్తుంది.. కానీ ఈ సాంగ్ ప్రోమో చూస్తే.. ఈ సాంగ్ అంతగా ఉందా అనిపిస్తుంది.. అంటే కీరవాణి - రాజమౌళి కాంబో అంటే ప్రేక్షకులు, ఫాన్స్ లో విపరీతమైన అంచనాలుంటాయి. మరి ఈ సాంగ్ ఆ అంచనాలను అందుకుంటుందా.. లేదా.. అనేది రేపు సాయంత్రం 4 గంటలకు క్లారిటీ వస్తుంది. 

RRR Naatu promo video raises expectations:

RRR Naatu promo video raises expectations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs