ఈ ఏడాది సీటిమార్ తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన గోపీచంద్.. ప్రతి రోజు పండగే లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ కలిసి మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మాతగా పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ టైటిల్ కు అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటు సాధరణ వరుకు అంతటా అనూహ్యమైన స్పందన లభించడం విశేషం. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది.
తాజాగా పక్కా కమర్షియల్ టీజర్ విడుదలైంది. ఎవరికీ చూపిస్తున్నారు సార్ మీ విలనిజం.. మీరు ఇప్పుడు చేస్తున్నారు నేను ఎప్పుడో చూసి చేసి వదిలేసాను.. అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్స్ కు ఒక అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. టీజర్ లోని ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ కి జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది.