Advertisement
Google Ads BL

అఖండ టైటిల్ సాంగ్ అదరగొట్టేసారు


నటసింహ నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మ్యాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం అఖండ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అఖండ రిలీజ్ డేట్స్ వేటలో ఉన్న మేకర్స్ మరో వైపు ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్‌లో మొదలు పెట్టారు.

Advertisement
CJ Advs

ఈ దీపావళి సందర్బంగా విడుదల చేసిన టైటిల్ సాంగ్ ప్రోమో అందరినీ ఆకట్టుకుంది. ఆ వీడియోకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక జోష్‌ను పెంచేందుకు చిత్రయూనిట్ లిరికల్ వీడియోను విడుదల చేసింది. తమన్ సంగీత సారధ్యంలో శంకర్ మహదేవన్, అతని కుమారులు కలిసి పాడిన అఖండ టైటిల్ సాంగ్ ఈ ఏడాది మాస్ ఆంథమ్‌గా నిలిచేలా ఉంది. ఇందులో అఘోర పాత్రలో బాలయ్య కనిపించడం ప్రత్యేకమైన విషయం. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ పాటకు అనంత శ్రీరామ్ అద్బుతమైన సాహిత్యాన్ని అందించారు.

మొదటగా మెలోడీ ట్రాక్ అడిగా అనే పాటను విడుదల చేశారు. మ్యూజిక్ లవర్స్‌ను ఆ పాట తెగ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన టైటిల్ ట్రాక్ క్షణాల్లో వైరల్ అయింది. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతోన్న మూడో చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలున్నాయి.

Balakrishna Akhanda Title Song Released:

<span>Nandamuri Balakrishna, Boyapati Srinu, Dwaraka Creations Akhanda Title Song Released</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs